మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ .. మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటో రిక్షా తయారీ కేంద్రాన్ని సందర్శించారు. అంతేకాక ఎలక్ట్రిక్ ఆటో ను నడుపుతూ తెగ సందడి చేశారు.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన ఏం పని చేసినా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన అపర కుబేరుల్లో ఒకరైనప్పటికీ ఓ సామాన్యుడిలా వ్యవహరిస్తూ అందరిని ఆకర్షిస్తుంటారు. అలానే బిల్ గేట్స్ దాతృత్వం గురించి అందరికీ తెలిసిందే. రెండు దశాబ్దాల నుంచి గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఏటా బిలియన్ డాలర్లు సమాజం కోసం ఖర్చు చేస్తున్నారు. ఇటీవలే భారత్ లో పర్యటించిన సమయంలో బిల్ గేట్స్ .. మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటో రిక్షా తయారీ కేంద్రాన్ని సందర్శించారు. అంతేకాక ఎలక్ట్రిక్ ఆటో స్వయంగా డ్రైవ్ చేస్తూ రయ్ రయ్ మంటూ దూసుకెళ్లారు. ఆ వీడియోను ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడయో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొన్ని రోజుల క్రితం పర్యటన నిమిత్తం బిల్ గేట్స్ ఇండియాకు వచ్చారు. పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను, పారిశ్రామికవేత్తలతో బిల్ గేట్స్ సమావేశం అయ్యారు. అంతేకాక ఇటీవలే ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటాను కలసిన బిల్ గేట్స్.. ఓ పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇలా పలువురుతో భేటీ అయినా బిల్ గేట్స్ మహీంద్ర ట్రియో ఎలక్ర్టిక్ ఆటో రిక్షా తయారీ కేంద్రాన్ని కూడా సందర్శించారు. అంతేకాక తయారీ కేంద్రంలో కాసేపు సరదాగా ఆ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను నడిపారు. ఆవీడియోను ఆయన తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.”ఆవిష్కరణల కోసం భారతీయులు దాహం ఎప్పటకీ తీరిపోదు. నేనో ఎలక్ట్రిక్ రిక్షాను నడిపాను” అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు బిల్‌గేట్స్. ఆ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా 131 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని ఆయన అన్నారు.
అంతేకాక ఈ ఆటోలో నలుగురు సులువుగా ప్రయాణం చేయగలరని చెప్పారు. ట్రాన్స్‌పోర్టు ఇండస్ట్రీలో కార్బన్‌రహిత వాహనాలకు మహేంద్ర కంపెనీ ఆదర్శంగా నిలుస్తుందని బిల్ గేట్స్ ఆ వీడియోకు కామెంట్ జోడించారు. బిల్ గేట్స్ చేసిన పోస్టుపై మహేంద్ర కంపెనీ అధినేత ఆనంద్ మహేంద్ర స్పందించారు. బిల్ గేట్ వీడియోను ట్వీట్ చేస్తూ “చల్తీ కా నామ్ బిల్ గేట్స్‌కి గాడి” అంటూ ఆనంద్ మహేంద్ర కామెంట్ చేశారు. ట్రియో వాహనాన్ని నడిపే సమయం మీకు దొరికినందుకు గర్వంగా ఉందంటూ ఆనంద్ మహేంద్ర తన ట్వీట్‌లో తెలిపారు. మరో సారి మీరు భారత్ కు వచ్చినప్పుడు ఈ ఆటోలతో రేస్‌లో పాల్గొందామని, ఆ రేసులో మీరు, నేను, సచిన్ ఉంటారని ఆనంద్ మహేంద్ర తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. ఈ వీడియోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
“Chalti ka Naam Bill Gates ki Gaadi” So glad you found the time to check out the Treo @BillGates Now on your next trip’s agenda should be a 3-wheeler EV drag race between you, @sachin_rt and me… pic.twitter.com/v0jNikYyQg
— anand mahindra (@anandmahindra) March 6, 2023