ఈ మద్య ఏ వస్తువు కొన్నా డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు. సాధారణంగా చిన్న పిల్లలకు డబ్బులు ఇస్తే వాటిని ఇంట్లో ఉండే చిన్న డబ్బాల్లో, కిట్టి బ్యాంకుల్లో వేస్తుంటారు. అలా ఆ బ్యాక్స్‌లు నిండిన తర్వాత ఆ డబ్బు దేనికోదానికి ఉపయోగపడుతుందని అలా చేస్తుంటారు. ప్రతి మధ్యతరగతి కుటుంబంలో జరిగే తంతే ఇది. అసోం రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఓ స్కూటర్ కొనుగోలు చేశాడు. స్కూటీ కొనగులు చేస్తే దాని గురించి చెప్పాల్సిన అవసరం ఏంటా అని అనుకుంటున్నారా? ఇక్కడే ట్విస్ట్ ఉంది. అతడు స్కూటర్ కొనుగోలు చేసింది కరెన్సీ నోట్లతో కాదు, ఆన్ లైన్ పేమెంట్ తో అంతకన్నా కాదు.
ఓ బస్తా నిండా చిల్లర నాణేలు వేసుకుని వెళ్లి షోరూంలో తనకు నచ్చిన స్కూటర్ కొనుగోలు చేశాడు. స్టేషనరీ షాప్ నడుపుతున్న ఆ వ్యక్తి కొత్త స్కూటర్ కొనడం కోసం 8 నెలలుగా చిల్లర పోగు చేశాడట. అలా కొన్ని గోనె సంచుల నిండా చిల్లర జమ అయింది. వెహికల్‌ను కొనడానికి తన దగ్గర తగినంత డబ్బు ఉందని భావించి, వాహనాన్ని కొనుగోలు చేసేందుకు హౌలీలోని స్కూటర్ షోరూమ్‌కు వెళ్లాడు.
ఇది చదవండి: బాలకృష్ణ NBK-107 సినిమా షూటింగ్ ఫోటో లీక్
ఇక ఆ చిల్లర లెక్కించేందుకు షోరూం సిబ్బంది కాస్త శ్రమపడాల్సి వచ్చింది. ఇతర పనులన్నీ మానుకుని ప్లాస్టిక్ ట్రేలలో వేసుకుని ఆ చిల్లర నాణేలు లెక్కించారు. ఎలాగైతేనేం… ఆ వ్యక్తి స్కూటర్ కొనుగోలు చేశాడు. ఈ కొనుగోలు లావాదేవీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.