దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా.. చలాన్లు వేసినా వాహనదారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. పైగా రీల్స్ కోసం ఈ మద్య రోడ్లపై రక రకాల విన్యాసాలు చేస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు.
ఈ మద్య ప్రతి చిన్న పనికి ద్విచక్రవాహనాలు ఉపయోగించడం కామన్ అయ్యింది. పట్టణాల్లోనే కాదు.. పల్లెటూళ్లలో కూడా వాహనాల వాడకం ఎక్కువ అయ్యింది. ఇక కొంతమంది యూత్ షోరూం లోకి కొత్త బైక్ వస్తే చాలు ఎంత ఖరీదైనా కొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కొంతమంది బైక్ కొనుగోలు చేయడానికి చిల్లర నాణేలు తీసుకువెళ్లిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఈ మద్య ఏ వస్తువు కొన్నా డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు. సాధారణంగా చిన్న పిల్లలకు డబ్బులు ఇస్తే వాటిని ఇంట్లో ఉండే చిన్న డబ్బాల్లో, కిట్టి బ్యాంకుల్లో వేస్తుంటారు. అలా ఆ బ్యాక్స్‌లు నిండిన తర్వాత ఆ డబ్బు దేనికోదానికి ఉపయోగపడుతుందని అలా చేస్తుంటారు. ప్రతి మధ్యతరగతి కుటుంబంలో జరిగే తంతే ఇది. అసోం రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఓ స్కూటర్ కొనుగోలు చేశాడు. స్కూటీ కొనగులు చేస్తే దాని గురించి చెప్పాల్సిన అవసరం […]