ఈ మద్య ప్రతి చిన్న పనికి ద్విచక్రవాహనాలు ఉపయోగించడం కామన్ అయ్యింది. పట్టణాల్లోనే కాదు.. పల్లెటూళ్లలో కూడా వాహనాల వాడకం ఎక్కువ అయ్యింది. ఇక కొంతమంది యూత్ షోరూం లోకి కొత్త బైక్ వస్తే చాలు ఎంత ఖరీదైనా కొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కొంతమంది బైక్ కొనుగోలు చేయడానికి చిల్లర నాణేలు తీసుకువెళ్లిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు. చేతిలో నగదు అస్సలు ఉంచుకోవడం లేదు.. ఏవరికైనా డబ్బు ఇవ్వాలన్నా.. తీసుకోవాలన్నా ఆన్ లైన్ ట్రాన్సక్షన్లే ఎక్కువగా జరుగుతున్నాయి. చిల్లర నాణేలు జోలికి ఎవ్వరూ వెళ్లడం లేదు. కానీ కొంతమంది చాలా కాలంగా చిల్లర నాణేలు పొదుపు చేసి వాటితో తమకు ఇష్టమైన బైక్స్ కొనుగోలు చేసి తమ కల నెరవేర్చుకుంటున్నారు. ఇక చిల్లర నాణేలు తీసుకున్న షోరూం సిబ్బంది.. వాటిని లెక్కించడానికి రోజులు పట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ఘటనలు ఇటీవల ఎన్నో జరిగాయి. తాజాగా ఓ వ్యక్తి చాలా కాలంగా చిల్లర నాణేలు పోగు చేసి ద్విచక్రవాహనం కొనుగులో చేశాడు. ఈ ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఈ మద్య కాలంలో చాలా మంది యువత కొత్త బైక్స్ పై అసక్తి కనబరుస్తున్నారు. మార్కెట్ లోకి కొత్త బైక్ వస్తే ఎంత ఖరీదైనా కొనేసి.. రోడ్లపై షికారు చేస్తున్నారు. తాజాగా అస్సాం కి చెందిన ఓ వ్యక్తి మొత్తం చిల్లర నాణేలతో ద్విచక్రవాహనం కొనుగోలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అస్సాంలోని దరంగ్ జిల్లా కి చెందిన మహమ్మద్ సైదుల్ హక్ అనే వ్యక్తి బోరేగావ్ ప్రాంతంలో ఓ చిన్న దుకానం నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. మహ్మమ్మద్ కి ఎప్పటి నుంచి ఓ ద్విచక్రవాహనం కొనుగోలు చేయాలని ఆశ ఉండేది. అది అతని చిరకాల కోరిక. అందుకోసం ఒకేసారి డబ్బు వెచ్చింది కొనడం కష్టమని భావించిన మహ్మమ్మద్ ఆరేళ్లుగా చిల్లర నాణేలను జాగ్రత్తగా పోగు చేస్తూ వచ్చాడు.
ఆరేళ్లుగా కష్టపడి కూడబెట్టిన నాణేలు ఓ బస్తాలో వేసుకొని బైక్ షోరూం కి వెళ్లాడు. ముందుగానే బైక్ షోరూమ్ యజమానిని కలిసి తన వద్ద రూ.90 వేల చిల్లర నాణేలు ఉన్నాయని.. తాను ఒక బైక్ కోనుగోలు చేయాలని చెప్పాడు. అందుకు బైక్ షోరూమ్ మేనేజర్ ఒప్పుకోవడంతో రూ.90 వేల విలువైన బైక్ ని కొనుగోలు చేశాడు మహ్మమ్మద్. మొత్తానికి తాను ఎప్పటి నుంచో కంటున్న కల ఇన్నాళ్లకు నెరవేరిందని ఆనందంలో మునిగిపోయాడు మహ్మమ్మద్. ఈ సందర్భంగా బైక్ షోరూం మేనేజర్ మాట్లాడుతూ.. మహ్మమ్మద్ వచ్చి తన వద్ద చిల్లర నాణేలు ఉన్నాయని.. తనకు ఎప్పటి నుంచో బైక్ కొనాలనే ఆశ ఉందని చెప్పగా మొదట ఆశ్చర్యపోయినా.. అతని కోరిక మేరకు చిల్లర తీసుకున్నామని తెలిపాడు.. ఆ చిల్లర మొత్తం లెక్కించడానికి చాలా సమయం పట్టిందని అన్నాడు.
#WATCH | Assam: Md Saidul Hoque, a resident of the Sipajhar area in Darrang district purchased a scooter with a sack full of coins he saved. pic.twitter.com/ePU69SHYZO
— ANI (@ANI) March 22, 2023