భారత్ కు చెందిన క్షిపణి ఒకటి టెక్నాలజీ మాల్ ఫంక్షన్ వల్ల పాకిస్థాన్ భూభాగంలో పడిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పరిస్థితులు కాస్త వేడెక్కాయి. అయితే తాజాగా భారత్ పై పంతానికి పాక్ క్షిపణి ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. అయితే పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా తయారైంది పాక్ పరిస్థితి. ఆ క్షిపణి గాల్లోకి వెళ్లిన కొద్ది సెక్లలోనే నేల కూలింది. పంతానికి పోయి పాకిస్థాన్ పరువు పోగొట్టుకున్నట్లైంది. ఈ ఘటనపై స్థానిక మీడియా సంస్థలు ప్రసారాలు చేయడంతో విషయం వెలుగు చూసింది.
ఇదీ చదవండి: కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్‌కు ‘వై’ కేటగిరి భద్రత!
వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్ లోని ఎలాంటి ప్రకటన చేయలేదు. పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్ లోని జంషోరో ప్రాంతంలో గురువారం ఓ గుర్తుతెలియని వస్తువు గాల్లోకి ఎగిరి.. కాసేపటికే కింద పడిపోవడాన్ని స్థానికులు కొందరు గుర్తించారు. ఆ విషయమై పోలీసులు విచారణ కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. పాక్ మీడియా కథనాల ప్రకారం.. సింధ్ టెస్ట్ రేంజ్ నుంచి ఓ క్షిపణి ప్రయోగం జరిగింది. 12 గంటల ప్రాంతంలో క్షిపణి గాల్లోకి లేచింది. సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలింది.
అది సాధారణ మోర్టార్ ట్రేసర్ రౌండ్ అని స్థానిక అధికారులు వెల్లడించినట్లు తెలుస్తోంది. కానీ, అది కచ్చితంగా క్షిపణే అని సమాచారం. భారత్ పై పంతానికే పాక్ ఈ ప్రయోగం చేసి ఉండచ్చని అక్డి ఒక మీడియా సంస్థ వెల్లడించింది. ఈ నెల 9న సాధారణ పరీక్షల్లో చిన్న లోపం కారణంగా భారత్ నుంచి ఓ క్షిపణి పాకిస్థాన్ లోని భూభాగంలోకి దూసుకెళ్లింది. ఆ విషయాన్ని రక్షణ శాఖ స్వయంగా వెల్లడించింది.
ఇదీ చదవండి: పాకిస్థాన్ లోకి దూసుకెళ్లిన ఇండియన్ మిసైల్!
🚨 An unidentified object or SAM missile fallen from Sky in Jamshoro, Pakistan.
Local sources in Pakistan say that to respond to India’s missile misfire, Pakistan tested a missile that failed and fell in civilian areas. pic.twitter.com/C0WYq1CkHU
— OSINT Updates 🚨 (@OsintUpdates) March 17, 2022