సమాజంలో ఎంతో మంది యువతి యువకులు ప్రేమ కోసం ఏదైన చేయటానికి సిద్దంగా ఉంటారు. మనసుకు నచ్చిన అమ్మాయి లవ్ ప్రపోజల్ పంపిన తర్వాత ఆక్సెప్ట్ చేస్తే సంతోషం లేకుంటే బాధపడుతూ ఉంటారు. కానీ మధ్యప్రదేశ్‌లో ఓ యువకుడు మాత్రం అమ్మాయి రిజక్ట్ చేసిందని విచిత్ర ప్రచారానికి తెర తీశాడు. ఇక వివరాల్లోకి వెళ్తే..గ్వాలియర్‌లోని అజయ్ అనే యువకుడు ఓ యువతికి తెలియకుండా ఎన్నో రోజుల నుంచి ఇష్టపడుతున్నాడు. తీర ఎలాగైన ప్రపోజ్ చేయాలని భావించాడు.
సమయం చూసుకుని తన ప్రేమ గురుంచి ఆ అమ్మాయికి తెలిపేందుకు వెళ్లాడు. ఇక నువ్వంటే నాకు ఇష్టమని..ఐలవ్ యూ అంటూ తన మనసులోని భావాన్ని అమ్మాయి ముందు వ్యక్తపరిచాడు. దీనికి ఆ యువతి వెంటనే ఆ ప్రపోజ్‌ను రిజక్ట్ చేసింది. దీంతో మనోడు బాధ పడుతు అక్కడి నుండి వెనుదిరిగాడు. ఏం చేయాలో అర్థం కాక ఓ ఐడియాకు శ్రీకారం చుట్టాడు.
అదేంటంటే..? తన ప్రేమకు ఆ యువతి ఒప్పుకోకపోవటంతో ఆ యువకుడు ఆ అమ్మాయి పోటోలను తన ఫోటోకు జత చేసి నా భార్య అంటూ పోస్టర్లు తయారు చేశాడు. ఇక ఇవే పోస్టర్లను తెల్లారేసరికి ఊరంత అంటించి అందరికీ తెలిసేలా చేశాడు. దీంతో పాటు అదే పోటోలను సోషల్ మీడియలో అప్‌లోడ్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఇక అమ్మాయి కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని ఆ యువకుడిని పోలీసులకు అప్పగించారు.