జయలలిత పేరు చెబితే తెలియని వారుండరనేది కాదనలేని వాస్తవం. అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లో తమిళనాడుకు ఆమె చేసిన సేవలు అనేకమని చెప్పాలి. ముఖ్యమంత్రిగా అనేక దఫాలుగా పని చేసి తమిళనాడు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఇక విషయం ఏంటంటే..? తాజాగా జయలలిత కుమార్తె తానేనంటూ చెన్నైలోని ఆమె సమాధి వద్ద ఓ మహిళ హల్‌చల్ తో రచ్చ రచ్చ చేసింది.
దీపావళి సందర్భంగా చెన్నైలోని ఆమె సమాధి వద్ద నివాళులర్పించటానికి వచ్చిన ఆమె సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ వార్తలో నిలిచింది. మీరు జయలలిత కుమార్తె అయితే ఇన్ని రోజుల స్పందించకుండా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ కొందరు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ దీనికి అనేక కారణాలున్నాయని తెలిపింది. ఆమె మరణం తర్వాత నేను తీవ్ర మనోవేధనకు గురయ్యానని అందుకే బయటకు రాలేదని చెప్పుకొచ్చింది.
జయలలిత కూతురు నేనే అనటానికి అనేక ఆధారాలున్నాయని మంచి రోజు చూసుకుని త్వరలో అన్ని వివరాలు తెలియజేస్తానని ఆమె తెలిపింది. ఇక దీంతో పాటు తనను పెంచి పోషించిన తండ్రి మైసురులో ఉండేవారని ఈ మధ్యే ఆయన కూడా మరణించారని తెలియజేసింది. ఇక మరో విషయం ఏంటంటే..? అమ్మను గతంలో రెండు మూడు కలిశానని, ఇక త్వరలో శశికళను కూడా కలవబోతున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఈమె మాత్రం కర్ణాటకలోని మైసూరుకు చెందిన ప్రేమ అని తెలుస్తోంది. మరి ఇంతకు ఈమె వాదనలో నిజమెంత? నిజంగానే జయలలిత కూతురా లేక మరెవరు అనేది తెలియాల్సి ఉంది. ఇలా వినిపిస్తున్న ఈ మహిళ వాదనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.