ఇది పిల్లల్ని బడికి పంపే సమయం. వేసవిలో తల్లిదండ్రులు, అమ్మమ్మ,నాన్నమ్మ,తాతయ్యల సంరక్షణలో ఉండే పిల్లల్ని తిరిగి స్కూలుకు పంపడం తేలికే కానీ. అప్పటి వరకు అమ్మ, నాన్నల చాటున ఉన్న చిన్న పిల్లల్ని బడికి పంపడం అంటే పెద్ద టాస్కే.
ఇది పిల్లల్ని బడికి పంపే సమయం. వేసవిలో తల్లిదండ్రులు, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యల సంరక్షణలో ఉండే పిల్లల్ని తిరిగి స్కూలుకు పంపడం తేలికే కానీ. అప్పటి వరకు అమ్మ, నాన్నల చాటున ఉన్న చిన్న పిల్లల్ని బడికి పంపడం అంటే పెద్ద టాస్కే. ప్రస్తుతం భార్యా భర్తలిద్దరూ ఉద్యోగాల నిమిత్తం బయటకు వెళ్లిపోతున్న నేపథ్యంలో 3-4 ఏళ్లలోపు చిన్న పిల్లల్ని డే కేర్ లేదా కిండర్ గార్డెన్, ప్రీ స్కూల్స్‌లో జాయిన్ చేస్తున్నారు. దాని కోసం నగరంలోని బెస్ట్ స్కూల్ ఏవో వెతికి.. లక్షలు ఖర్చు అయినా పర్వాలేదని అక్కడ విడిచి పెడుతున్నారు. అలాంటి స్కూల్లో చదివిద్దామని మీరూ భావిస్తుంటే.. ఓ సారి ఈ వీడియో తిలకించండి.
ఓ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం.. మూడేళ్ల పిల్లవాడు.. తనకన్నా చిన్నవాడిపై ఘోరంగా విరుచుకుపడిన ఘటన కర్ణాటకలో కలకలం రేపింది. ప్రస్తుతం ఆ చిన్నారి దాడి చేసిన ఘటన వైరల్ అయ్యింది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందీ.. స్కూల్ సీసీ కెమెరాలో రికార్డు అయిన వీడియోను పరిశీలిస్తే.. బెంగళూరు చిక్కల సంద్ర ప్రాంతంలో ఉన్న టెండర్ ఫ్రూట్ స్కూల్‌లోని ఓ గదిలో పది మంది విద్యార్థులు ఉన్నారు. అంతలో ఆయా వచ్చి ఆ గదిలో ఉన్న ఒక పిల్లవాడిని బాత్రూముకని బయటకు తీసుకెళ్లిపోతుంది. అంతే అక్కడే ఉన్న ఓ మూడేళ్ల చిన్నారి.. మరో చిన్నారిని వెనక నుండి బలంగా తోసేశాడు. ఆ తర్వాత వీపుపై దబా దబా బాదేశాడు. ఆ చిన్నారి తేరుకుని పైకి లేవగా.. చెంపపై చెళ్లు మనిపించాడు. మళ్లీ బుడతడిపై వేగంగా దూసుకెళుతూ.. విసిరి గిరాటేశాడు మరో చిన్నారి. మళ్లీ కొట్టాడు. ఇలా విడతల వారీగా దాడి చేస్తూనే ఉన్నాడు. మెడ కొరకడం వంటి చర్యలకు దిగాడు.
తన్నులు తిన్న బాలుడు ముక్కు నుండి రక్తం వస్తుండటంతో తల్లి గమనించారు. స్కూల్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడంతో తల్లి కన్నీటి పర్యంతమైంది. ఇలా పిల్లల్ని వదిలేసి వెళ్లడంపై ఫైర్ అయ్యారు. దీనిపై స్కూల్ వివరణ ఇచ్చింది. పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బందిలో ఒకరు జ్వరం కారణంగా రాలేకపోయాని, అక్కడే ఉన్న మరొక సహాయకురాలు ఓ చిన్నారిని మూత్రశాలకు తీసుకెళ్లగా, మరొకరు ఫ్లోర్ క్లీనింగ్ పనిలో ఉన్నారని తెలిపింది. ఈ సమయంలోనే దురదృష్టకర సంఘటన చోటు చేసుకుందని తెలిపింది. అయితే ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి దాడి ఘటనపై విచారణ జరపాలని కర్ణాటక పోలీసులు ఆ రాష్ట్ర విద్యాశాఖకు సూచించారు. ఈ మేరకు విద్యాశాఖను నివేదిక ఇవ్వమని కోరారు. ఆ పాఠశాలపై తీసుకున్నచర్యల గురించి తెలపాలని పేర్కొన్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడంతో నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ఇలాంటి స్కూల్స్ లో వేసేముందు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటి స్కూల్స్ లో మీ పిల్లలను చేర్చవద్దని సలహాలిస్తున్నారు.
We received a disturbing video of a preschool where toddlers are left unattended in a closed room. A senior kid is seen hitting repeatedly a junior school. The school’s name is Tenderfoot, Chikkalasandra, Bengaluru- 560061. Please don’t send your kid there! 🙏🏻 #childabuse pic.twitter.com/IeGsj2M9b2
— Citizens Movement, East Bengaluru (@east_bengaluru) June 22, 2023