సోమవారం రాత్రి ఓ మహిళ ఇంట్లో ఏసీ ఆన్ చేసి తన ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రపోయింది. దీంతో ఆ ఏసీ ఒక్కసారిగా పేలింది. మంటల్లో ఆ మహిళతో పాటు ఇద్దరు పిల్లలు సజీవదహనమయ్యారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
వేసవి కాలం మొదలవడంతో ఎండలు విపరీతంగా దంచికొడుతున్నాయి. దీంతో వేసని నుంచి కాస్త చల్లదనాన్ని పొందేందుకు ఓ మహిళ ఇంట్లో ఏసీ ఆన్ చేసింది. అలా ఆ మహిళ పిల్లలతో పాటు నిద్రపోతుండగా హఠాత్తుగా ఇంట్లో ఉన్న ఏసీ పేలింది. ఇక చూస్తుండగానే ఇళ్లంత మంటలు అంటుకుని మహిళతో పాటు ఇద్దరు పిల్లలు సైతం ఆ మంటల్లో సజీవదహనమయ్యారు. తాజాగా కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?
అది కర్ణాటక రాష్ట్రం రాయుచూర్ జిల్లాలోని శక్తినగర్ ప్రాంతం. ఇక్కడే రంజిత, సిద్దలింగయ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగి మృదుల(13), కారుణ్య (11) అనే పిల్లలు కూడా ఉన్నారు. అయితే భర్త సిద్దలింగయ్య స్థానికంగా ఉండే థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రంలో ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. ఇలా వారి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి కాపురం ఎంతో సంతోషంగా సాగింది. ఇదిలా ఉంటే సోమవారం రాత్రి భర్త సిద్దలింగయ్య ఉద్యోగానికి వెళ్లడంతో.. భార్య, ఇద్దరు పిల్లలు ఏసీ ఆన్ చేసి నిద్రపోయారు.
అయితే రాత్రిపూట ప్రమాదవశాత్తు ఆ ఏసీకి కరెంట్ షాక్ తగిలి ఒక్కసారిగా ఏసీకి మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ ఏసీ ఒక్కసారిగా పేలింది. ఈ మంటల్లో ఆ మహిళతో పాటు ఇద్దరు పిల్లలు సజీవదహనమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న భర్త సిద్దలింగయ్య భార్యా పిల్లలను అలా చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇక వెంటనే స్పందించిన స్థానికులు మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఆ మంటల్లో కాలిపోయిన తల్లిని ఇద్దరు పిల్లలను చూసి గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో వారి గ్రామ ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు.