అవసరాలకు తెచ్చుకుంటున్న వస్తువులు ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు, వస్తువులు పేలుతున్న ఘటనలు చూశాం. వస్తువుల తయారీలో నాణ్యతా లోపమే, లేదా షార్ట్ సర్య్కూట్ వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయో తెలియడం లేదు. తాజాగా కర్ణాటకలో ఓ వస్తువు ముగ్గురు ప్రాణాలను తీసింది.
సోమవారం రాత్రి ఓ మహిళ ఇంట్లో ఏసీ ఆన్ చేసి తన ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రపోయింది. దీంతో ఆ ఏసీ ఒక్కసారిగా పేలింది. మంటల్లో ఆ మహిళతో పాటు ఇద్దరు పిల్లలు సజీవదహనమయ్యారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.