కొన్నిసార్లు చనిపోయిన వ్యక్తి చాలా కాలం తర్వాత తిరిగి కళ్ల ముందు ప్రత్యక్షం అయితే ఆ కుటుంబ సభ్యులు ఎంత సంతోషిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
ఇటీవల కొంతమంది చిన్న విషయాలకే మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. ఇంట్లో చెప్పకుండా దూరంగా వెళ్లిపోతుంటారు. చాలా వరకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ల ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఓ వ్యక్తి అప్పులబాధ తాళలేక ఇంటి నుంచి పారిపోయాడు. దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు. కానీ అప్పటికే ఆ వ్యక్తి చనిపోయాడని డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారు కుటుంబ సభ్యులు.. ఇక అప్పటి నుంచి ఆయన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పూర్తి వివరాల్లోకి వెళితే..
తిరుపత్తూర్ జిల్లా ఆంబూర్ సమీపంలో చిన్నమలయంపట్టు గ్రామానికి చెందిన శ్రీరాములు, సావిత్రి నివసించేవారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పోషణలో భాగంగా శ్రీరాములు అప్పులు చేయాల్సి వచ్చింది.. కానీ తీర్చలేని పరిస్థితి ఉండటంతో అప్పుల వాళ్లు పెట్టే ఇబ్బందులు భరించలేక 1996 వ సంవత్సరంలో ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లిపోయాడు. భర్త కనిపించకపోవడంతో సావిత్రి అన్ని చోట్లా వెతికింది. ఎక్కడా జాడ తెలియకపోవడంతో అప్పుల బాధకు తాళలేక ఆత్మహత్య చేసుకొని ఉంటాడని భావించారు కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో శ్రీరాములు కు అంత్యక్రియలు కూడా చేశారు.
ఈ క్రమంలో కుమారుల భవిష్యత్ కోసం.. చేసిన అప్పులు తీర్చేందుకు శ్రీరాములు భార్య సావిత్రి 2003 లో అంబూరు మున్సిపాలిటీ నుంచి డెత్ సర్టిఫికెట్ పొందారు. దాన్ని భర్త పనిచేసే కంపెనీలో చూపించి వచ్చని సర్వీసు డబ్బుతో అప్పులన్నీ తీర్చారు. ఇదిలా ఉండగా.. 2022 లో ఏప్రిల్ లో శ్రీరాములు హఠాత్తుగా గ్రామంలో ప్రత్యేక్షం అయ్యాడు. తాను చేసిన తప్పుకు కుటుంబ సభ్యులను క్షమాపణలు అడిగాడు. అంతా బాగుందనుకుంటున్న సమయంలో శ్రీరాములు డెత్ సర్టిఫికెట్ ఇబ్బందులు తెచ్చి పెట్టింది. దీంతో తాను బతికే ఉన్నాను.. తన డెత్ సర్టిఫికెట్ రద్దు చేయాల్సిందిగా శ్రీరాములు, కుటుంబ సభ్యులు తహసీల్తార్, కలెక్టర్ తదితర రెవెన్యూ శాఖ అధికారులకు వినతీ పత్రం సమర్పించా.. ఫలితం కనిపించలేదు. పది నెలలుగా శ్రీరాములు తన డెత్ సర్టిఫికెట్ రద్దు చేయాలని పోరాటం చేస్తున్నాడు. తన భర్త వచ్చినందుకు సంతోషించాలో.. చనిపోయిన వారి జాబితాల్లో ఉన్నందుకు బాధపడాలో అర్థంకాని అయోమయ పరిస్థితిలో పడ్డారు కుటుంబ సభ్యులు.