వ్యవసాయం.. భారతీయ సనాతన సాంప్రదాయాంగా కొనసాగుతోన్న వృత్తి. కానీ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు ఒకవైపు.. అతి వృష్టి, అనా వృష్టి మరోవైపు.. అందువల్లే చాలా మంది కాడిని వదిలేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ వృద్ధుడు చేసిన సాహసం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. మరి ఆ వ్యక్తి చేసిన పని ఏమిటి? దేశం మెుత్తం ఆయన వైపూ ఎందుకు చూస్తుందో తెలుసుకుందాం పదండి.
”భారతదేశంలో వ్యవసాయం జూదం లాంటింది.” ఈ మాట చెప్పింది సాదాసీదా వ్యక్తి కాదు. ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్యసేన్. ఈ ఒక్క మాటలోనే భారతీయ వ్యవసాయ విధాన్నాన్ని అర్థం చేసుకోవచ్చ. ఈ క్రమంలో ఒక వృద్ధుడు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. ఆయన చేసిన గొప్ప ప్రయత్నాన్ని ఇప్పుడు అందరూ పొగుడుతున్నారు. ఆయనే ఉత్తరప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ కు చెందిన 105 సంవత్సరాల కురు వృద్ధుడు బైద్యనాథ్ రాజ్ పుత్..
బైద్యనాథ్ కు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే మక్కువ. దాంతో హోంగార్డుగా పదవీ విరమణ చేసిన తర్వాత పూర్తిగా వ్యవసాయంపై దృష్టి పెట్టాడు. గత 40 సంవత్సరాలుగా పొలం లోనే గుడిసె వేసుకుని జీవిస్తున్నాడు. ప్రస్తుతం అతని వయసు 105 ఏళ్లు. ఇందులో విశేషం ఏముంది అంటారా? అక్కడికే వస్తున్నా ఆగండి. తన వ్యవసాయ భూమిలో నీటి సమస్యను గుర్తించాడు బైద్యనాథ్. అంతటితో ఆగకుండా ఏకంగా 5ఏళ్లు కష్టపడి 3 ఎకరాల చెరువును తవ్వాడు.
105ఏళ్ల వయసులోను విశ్రాంతి తీసుకోకుండా 3 ఎకరాల్లో చెరువును తవ్వడం అనేది గర్వించ దగ్గ విషయమని స్థానికులు తెలిపారు. ఈ నీటితో పండ్లతోటలను పండిస్తున్న బైద్యనాథ్, ఆ పండ్లను అక్కడి పిల్లలకి ఉచితంగా ఇస్తానని ఆయన తెలిపారు. చిన్న పనిచేస్తేనే మనం తెగ ఇబ్బంది పడిపోతాం. అలాంటిది బైద్యనాథ్ చేసిన సహసాన్నిచూసి మనం చాలా నేర్చుకోవాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 3 ఎకరాల్లో చెరువును తవ్విన ఈ నవయువ భగీరథుని గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.