ప్రమాదం జరిగి చావుబతుకుల మధ్య ఉండి వాహనం నుంచి బయటపడలేక అందులోనే కాలి బూడిదైన దారుణ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో బుధవారం చోటుచేసుకుంది. రామ్‌గఢ్ జిల్లా రాజ్‌రప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని ముర్బంద వద్ద 23వ జాతీయ రహదారిపై కారును బస్సు ఢీ కొట్టింది. అనంతరం కారులో మంటలు అంటుకుని బస్సుకు వ్యాపించాయి. దీంతో ఐదుగురు ప్రయాణికులు మండల్లో కాలిపోయారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. బస్సు డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. మృతులు పట్నాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.