దేశంలోని ఆర్థిక వ్యవస్థపై మద్యం అనేది తీవ్ర ప్రభావం చూపిస్తుందనే విషయం అందరికి తెలిసిందే. చాలా రాష్ట్రాలకు మద్యం ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ అని అనేక సర్వేలు వెల్లడైంది. కరోన సమయంలో మద్యం అమ్మకాలు నిషేధించినప్పుడు.. చాలా రాష్ట్రాలు భారీగా ఆదాయం పడిపోయినట్లు సమాచారం. మద్యం వినియోగం విషయంలో చాలా సర్వేలు అనేక విషయాలు వెల్లడించాయి. తాజాగా మద్యం తాగేవారి విషయంలో మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఓ ఐదు రాష్ట్రాల ప్రజలు తాగే మద్యం మిగిలిన అన్ని రాష్ట్రాల ప్రజలు తాగే మద్యంకి సమానమంట. ఓ జాతీయ మీడియా చేసిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మరి.. ఆ ఐదు రాష్ట్రాలేంటో, ఆ సర్వే వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
సర్వే సంస్థ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం మద్యంలో 48 శాతం మద్యాన్ని తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలే తాగేస్తున్నారంట. ఈ ఐదు రాష్ట్రాల ప్రజలు మద్యాన్ని గరిష్టంగా వినియోగిస్తున్నారని సర్వేలో వెల్లడైంది. ఐదు రాష్ట్రాల్లో అత్యధికంగా మద్యం వినియోగించే రాష్ట్రంగా తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కేరళ, కర్నాటక, ఏపీ, తెలంగాణా రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాలైన ఢిల్లీ,పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్.. ఇలా మిగిలిన అన్ని రాష్ట్రాలో 52 శాతం మద్యం వినియోగంలో ఉందని తేలింది.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకం.. షాక్‌లో వైద్య శాఖ.. మరీ ఇంత దారుణమా!ఆదాయం విషయానికి వస్తే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కేరళ రాష్ట్ర ఆదాయ వనరుల్లో మద్యం అమ్మకాల ద్వారా అధికా శాతం రెవెన్యూ సాధింస్తుంది. ఎందుకంటే దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేరళ ప్రభుత్వం మద్యంపై అత్యధిక పన్ను వసూలు చేస్తుంది. సౌత్ ఇండియాలో మద్యం తాగుతున్న వారి శాతం మిగిలిన్న అన్ని రాష్ట్రాల్లో మద్యం తాగే వారిశాతంకి సమానంగా ఉంది. ఆ టాప్ లో ఉన్న ఐదు రాష్ట్రాలు కూడా సౌత్ స్టేట్స్ కావడం విశేషం. మరి.. సర్వేలో తెలిపిన ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.