తెలంగాణ డేంజర్ జోన్ కి చేరువలో ఉందా? తెలంగాణకు డేంజర్ ఏంటి? అభివృద్ధి విషయంలో దూసుకుపోతుంటే డేంజర్ అంటారేంటి? అనే కదా మీ అనుమానం. అవును ఆ అభివృద్ధికి కావాల్సిన పైసలు ఎక్కువ శాతం వచ్చే వ్యవస్థ వల్లే ఇప్పుడు తెలంగాణకు ముప్పు తెచ్చిపెడుతుంది.
దేశంలోని ఆర్థిక వ్యవస్థపై మద్యం అనేది తీవ్ర ప్రభావం చూపిస్తుందనే విషయం అందరికి తెలిసిందే. చాలా రాష్ట్రాలకు మద్యం ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ అని అనేక సర్వేలు వెల్లడైంది. కరోన సమయంలో మద్యం అమ్మకాలు నిషేధించినప్పుడు.. చాలా రాష్ట్రాలు భారీగా ఆదాయం పడిపోయినట్లు సమాచారం. మద్యం వినియోగం విషయంలో చాలా సర్వేలు అనేక విషయాలు వెల్లడించాయి. తాజాగా మద్యం తాగేవారి విషయంలో మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఓ ఐదు రాష్ట్రాల ప్రజలు తాగే మద్యం […]