ఫిల్మ్ డెస్క్- కోట శ్రీనివాస రావు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సీనియర్ నటుడు. కమేడియన్ గా కెరీర్ మెదలుపెట్టి, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. వయసు మీద పడటంతో ఈ మధ్య పెద్దగా సినిమాల్లో నటించడం లేదు కోటా శ్రీనివాస రావు. ఇక కోటా ఏ విషయంపైనైనా ముక్కుసూటిగా మాట్లాడతారన్న పేరుంది.
మరి ఈ మధ్య ఏమయ్యిందో గానీ, పరిశ్రమకు సంబందించిన చాలా అంశాలపై తన అభిప్రాయాలను చెబుతున్నారు కోటా శ్రీనివాస రావు. ఇండీస్ట్రీలో చాలా విషయాలపై రియాక్ట్ అవుతూ వార్తల్లో నిలుస్తున్నారు. పలువురు నటీ నటులపై ఆయన చేస్తున్న కామెంట్స్ టాలీవుడ్ లో చర్చనీయాంశమవుతున్నాయి. తజాగా యాంకర్ అనసూయ డ్రెస్సింగ్ విషయమై కోట చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. ఇదిగో ఇటువంటి సమయంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కోట శ్రీనివాస రావు, మెగా బ్రదర్ నాగబాబుపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
ఒక్క మెగా బ్రదర్ అనే గుర్తింపు తప్ప ఆయన కంటూ ఓ స్థానమే లేదని నాగబాబును ఉద్దేశించి అన్నారు కోట శ్రీనివాస రావు. అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ లేకపోతే నాగబాబు నథింగ్ అంటూ సంచలన కామెంట్ చేశారు. ఇంకేముంది నాగబాబుపై కోటా వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. కోట శ్రీనివాస రావు చేసిన ఈ వ్యాఖ్యలపై నాగబాబు రియాక్ట్ అవుతారా, లేక లైట్ తీసుకుంటారా అ్నదే ఉత్కంఠ రేపుతోంది.
‘మా’ ఎన్నికల సమయంలో తెలుగు వాళ్లకు మాత్రమే మా అసోసియేషన్ పీఠంపై కూర్చునే హక్కు ఉందని చెప్పారు కోటా శ్రీనివాస రావు. అంతే కాదు ప్రకాష్ రాజ్ ఏ రోజు షూటింగ్‌కు టైమ్ కు రాలేదంటూ కోటా కామెంట్ చేశారు. కోటా వ్యాఖ్యలను తప్పుబట్టిన నాగబాబు, కోట వయసు పెరిగినా మాట తీరు మారడం లేదని కౌంటర్ వేశారు.