హైదరాబాద్- రాజ్యసభ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ మంగళవారం 44వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ నేపధ్యంలో సంతోష్ కుమార్ కు పలువురు రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ఉద్యమంలా ప్రారంభించిన సంతోష్ కుమార్, పుట్టిన రోజు సందర్బంగా ఉప్పల్ భగాయత్ లో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు.
అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి ఆయన ఆశిస్సులు తీసుకున్నారు సంతోష్ కుమార్. ప్రగతి భవన్ లో కుటుంబంతో కలిసి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో సంతోష్ కుమార్ తన పుట్టిన రోజును పురస్కరించుకొని ఓ అరుదైన చిత్రాన్ని ట్వీట్టర్ లో పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోష్ కుమార్ ను భుజాలపై ఎత్తుకుని ఉన్న పాత ఫోటోను షేర్ చేశారు. సంతోష్ కుమార్ చిన్నతనంలో తీసిన ఫోటోగా తెలుస్తోంది.
ఇక ఈ ఫోటో ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సంతోష్ కుమార్, ఈ పుట్టుక నాది.. బ్రతుకంతా మీది.. అని రాశారు. టీఆర్ ఎస్ తో పాటు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. సంతోష్ కుమార్ తల్లిదండ్రులు రవీందర్ రావు, శశికళ. సంతోష్ తల్లి, సీఎం కేసీఆర్ సతీమణి శోభా సొంత అక్కా చెల్లెల్లు. పెద్దనాన్న కేసీఆర్ తో సంతోష్ కు అనుబంధం ఎక్కువే అని చెప్పాలి.
కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా ఆయన వ్యక్తిగత సహాయకుడిగా సంతోష్ పనిచేశారు. కేసీఆర్ తెలంగాణ సీఎం అయ్యాక, ఆయన వ్యక్తిగత, రాజకీయ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యులు అయ్యారు. కేసీఆర్ కు నమ్మకమైన వ్యక్తుల్లో సంతోష్ కుమార్ ఒకరని చెబుతారు.
“ఈ పుట్టుక నాది …..
బ్రతుకంతా మీది ……” pic.twitter.com/LHzUit0jLi— Santosh Kumar J (@MPsantoshtrs) December 7, 2021