ఆకుపచ్చని తెలంగాణే తన ధ్యేయమని మూడేళ్ల క్రితం ఒక ఉద్యమాన్ని ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఇప్పటి వరకు 16 కోట్ల మొక్కలను నాటించినట్లు వెల్లడించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో సెలబ్రిటీలను సైతం ఇందులో భాగస్వాములను చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి అతిథిగా విచ్చేసిన ఎంపీ.. వారికీ ఒక మొక్కను బహూకరించారు. వారానికో మొక్క నాటాలంటూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున ప్రభాస్ అడవిని దత్తత తీసుకున్న విషయాన్ని ప్రస్తావించాడు. […]
హైదరాబాద్- రాజ్యసభ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ మంగళవారం 44వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ నేపధ్యంలో సంతోష్ కుమార్ కు పలువురు రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ఉద్యమంలా ప్రారంభించిన సంతోష్ కుమార్, పుట్టిన రోజు సందర్బంగా ఉప్పల్ భగాయత్ లో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి ఆయన […]