న్యూజిలాండ్ ఆక్షన్ వెబ్ సైట్ ట్రేడ్ మీ వేదికగా కేవలం 8 ఆకులు కలిగిన ఈ అరుదైన మొక్కను ఆక్లాండ్ వాసి ఏకంగా రూ.14లక్షలకు సొంతం చేసుకున్నాడు. తెలుపు రంగులో ఉండే దీని పేరు రాపిడోఫోరా టెట్రాస్పెర్మా అని ట్రేడ్ మీ తెలిపింది. ఈ ఇండోర్ మొక్క కోసం ఓ వ్యక్తి వందలు వేలు కాదు ఏకంగా లక్షలు వెచ్చించాడు. రాయల్ గార్డెన్స్ కు చెందిన ఆన్లైన్ ప్లాంట్ రిజిస్టర్ క్యూలో నమోదైన వివరాల ప్రకారం ఈ మొక్క థాయ్‌లాండ్, మలేషియాకు చెందినదని వెల్లడైంది. ఓ ఇండోర్ మొక్క ఎవరూ ఊహించని ధరకు వేలంలో అమ్ముడుపోవడం హాట్ టాపిక్‌గా మారింది. అది పలికిన ధర తెలిసి అంతా విస్తుపోతున్నారు. రాపిడోఫోరా టెట్రాస్పెర్మా అనే ఈ మొక్క ప్రతి ఆకులో కాండం వలే అద్భుతమైన వైవిధ్యత ఉందని ట్రేడ్ మి తెలిపింది.
ఒకపక్క వేలం ప్రక్రియ సాగుతుండగా ఈ మొక్కకు లక్షకు పైగా వ్యూస్ దక్కాయి. మొక్కల పట్ల న్యూజిలాండ్ వాసులకు ఎంతటి ప్రేమ ఉందనేది దీన్నిబట్టి వెల్లడవుతోందని ట్రేడ్ మి ప్రతినిధి మిల్లీ సిల్వెస్టర్ పేర్కొన్నాడు. ఇళ్లల్లో పెంచుకునే మొక్కల్లో అత్యధిక ధర పలికిన అరుదైన మొక్క ఇదేనని ట్రేడ్ మీ వెల్లడింది. గత ఏడాది జరిగిన వేలంలో కేవలం ఆరు ఆకులు కలిగిన ఇండోర్ ప్లాంట్ ఏకంగా వేలంలో రూ. 3,91,000 పలికింది.