ఫిల్మ్ డెస్క్- మోనాల్ గజ్జర్.. బిగ్ బాస్ లో ఈమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ తో బాగా పాపులర్ అయిన మోనాల్.. ఆ తరువాత అడపా దడపా సినిమాలు చేస్తూనే, టీవీ షోల్లో పాల్గొంటోంది. ఇక మోనాల్ సోషల్ మీడియాలో బాగా యాక్టీగా ఉంటుంది. సమయం చిక్కినప్పుడల్లా తన అభిమానులతో ముచ్చటిస్తుంది. ఇక తన బిగ్ బాస్ హౌజ్ మేట్ అఖిల్‌తో కలిసి మోనాల్ చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరి పై ఎప్పుడూ హాట్ హాట్ చర్చ జరుగుతూనే ఉంటుంది.
మోనాల్, అఖిల్ ఇద్దరూ ప్రతి రోజు వీడియో కాల్లో మాట్లాడుకుంటారట. మోనాల్ ప్రస్తుతంహైద్రాబాద్ కు పర్మినెంట్ గా షిఫ్ట్ అయిపోయంది. మొత్తం మకాం అంతా హైదరాబాద్ కు మార్చేసింది. ఇప్పటి నుంచి తాను హైద్రాబాదీని అయిపోయానంటూ మోనాల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన ఇంటికి సంబంధించిన పనులతో, షాపింగ్ తో బిజీగా ఉన్నానని మోనాల్ అంది. తాజాగా లైవ్ లోకి వచ్చిన మోనాల్ అభిమానులతో సరదాగా ముచ్చటించింది.
లైవ్‌లోకి వచ్చిన కొద్ది సేపటికే వెళ్లిపోతోన్నానని మోనాల్ చెప్పడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. తన మొబైల్ బ్యాటరీ పది శాతానికి వచ్చింది, అది చచ్చిపోయేలా ఉందంటూ మోనాల్ ఫాలోవర్స్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్దమైంది. అలా ఫోన్ బ్యాటరీ అయిపోయే ముందే ఎందుకు లైవ్ లోకి వస్తావ్ అని ఓనెటిజన్ మోనాల్ పై అసహనం వ్యక్తం చేశాడు. ఆ నెటిజన్ ప్రశ్నకు మోనాల్ నవ్వుతూనే సమాధానం చెప్పింది. అలా చార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడైతేనే, ఆ కారణం చెప్పి ఇలా త్వరగా లైవ్‌లో నుంచి వెళ్లిపోవచ్చు కదా, అందుకే బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు లైవ్‌లోకి వస్తాను తమదైన స్టైల్లో సమాధానం చెప్పింది మోనాల్ గజ్జర్.