మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఓఎస్‌ను 2015 లో లాంచ్ చేస్తే, దాదాపు ఆరేళ్ల తరువాత విండోస్ 11 ను రీసెంట్ గా విడుదల చేసింది. కొత్త ఓఎస్‌లో ఆటో హెచ్డీఆర్ ఫీచర్ ఉంటుంది. ఇది ల్యాపీల్లో గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను పెంచుతుంది. హెచ్డీ మోనిటర్లు ఉన్న పీసీల్లోనూ ఇది పని చేస్తుంది. మైక్రోసాఫ్ట్ కొత్తగా విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)ను విడుదల చేసింది. లైసెన్స్ గలిగిన విండోస్ 10 ఉన్నవాళ్లకి ఇది ఉచితంగా లభిస్తోంది. కొత్తగా ల్యాప్ ట్యాప్ కొన్నవాళ్ళకి డీఫ్లాల్ట్ గా అందిస్తోందీ సంస్థ.
విండోస్ 10 కంప్యూటర్లలో అప్డేట్లు వచ్చిన ప్రతిసారి రీస్టార్ట్ అంటూ ఉంటుంది. ఒక్కోసారి నాలుగైదు సార్లు రీస్టార్ట్ అవుతుంది సిస్టమ్. అయితే విండోస్11లో ఆ సమస్య ఉండదట. ఎక్కువ శాతం బ్యాగ్రౌండ్‌లోనే అప్డేట్లు అయిపోతాయట. కొత్త డిజైన్, పర్ఫార్మెన్స్ల చాలా మార్పులు విండోస్ 11లో స్టార్ట్ మెనూలో స్క్రీన్ బాటమ్‌లో సెంటర్‌కు తీసుకొచ్చారు. జూన్ 28 ( ఈరోజు) లాంచ్ చేసిన విండోస్ 11 ఈ ఏడాది చివరికల్లా అందరికి అందుబాటులోకి వస్తోందిట.
మ్యాక్ ఓఎస్, క్రోమ్ ఓఎస్‌లో ఇలానే ఉంటాయి. మల్టిపుల్ మానిటర్స్ వాడే వారి కోసం విండోస్ 11 ఉపయుక్తంగా ఉంటుంది. రెండు స్క్రీన్లు కనెక్ట్ చేసిన తర్వాత ఏ స్క్రీన్‌లో ఏ యాప్ వాడాలి అనేది సులభంగా ఎంచుకోవచ్చు. స్క్రీన్ కంట్రోల్, లేఅవుట్ మార్పు లాంటివి కూడా సులభంగా చేసుకోవచ్చు. సులభంగా కంటెంట్‌ను అందించే ఏర్పాటు విండోస్ 11లో ఉంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ సాయంతో పబ్లిషర్ల నుంచి వార్తలను విడ్జెట్ రూపంలో అందిస్తోంది. ఎడమవైపునకు స్వైప్ చేస్తూ కొత్త కంటెంట్‌ను చదువుకోవచ్చు.
విండోస్ 10లో చాలామంది ఇబ్బంది పడ్డ అంశం లైవ్ టైల్స్. స్టార్ట్ మెనూ ఓపెన్ చేయగానే ఐకాన్లు జిఫ్‌ల తరహాలోనే ప్లే అవుతుంటాయి. అయితే కొత్త ఓఎస్‌లో ఈ ఆప్షన్ లేదు. రౌండెడ్ కార్నర్స్‌తో యాప్‌లు, సర్వీసుల ఐకాన్లు మార్చారు. విండోస్ 11 ఓఎస్ ఇన్స్టాల్/అప్డేట్ చేసుకోవాలంటే సిస్టమ్‌లో ఈ కనీస ఫీచర్లు ఉండాల్సిందే.
విండోస్ 11 ఓఎస్ ఉండాలంటే ఆ సిస్టమ్‌లో కనీసం 4జీబీ ర్యామ్, 64 జీబీ ఫ్రీ స్టోరేజీ ఉండాలి. 64 బిట్ సిస్టమ్ అయి ఉండాలి. 1 జీహెచ్‌జెడ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అయి ఉండాలి.