బిజినెస్ డెస్క్- టీవీ ఇప్పుడు ఇది లేని ప్రపంచాన్ని అస్సలు ఉహించలేము. వార్తలు, సీరియల్స్, సినిమాలు.. ఇలా ఏది చూడాలన్నా టీవీ కావాల్సిందే. టీవీ లేకపోతే ఒక్క క్షణం కూడా తోయదంటే అతియోశక్తి కాదేమో. ఇక టెక్నాలటీ పెరిగిన కొద్ది అత్యాధునిక ఫీచర్స్ తో టీవీలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ ఎంఐ భారత్ లో కొత్త క్యూఎల్ఈడీ టీవీని లాంచ్ చేసింది. మనదేశంలో లాంచ్ అయిన అత్యంత ఖరీదైన 75 అంగుళాల స్క్రీన్ షియోమీ టీవీ ఇదే కావడం విశేషం. ఇక ఈ టీవీ ఫీచర్స్ అదుర్స్ అని చెప్పవచ్చు. ఎంఐ టీవీ క్యూ1 టీవీలో 75 అంగుళాల క్యూఎల్ఈడీ 4కే యూహెచ్‌డీ డిస్ ప్లేను పొందుపరిచారు. క్వాంటం డాట్ టెక్నాలజీని ఇందులో అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 97 శాతంగా ఉండటం స్పెషల్.
ఈ టీవీలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ ను కూడా అందించారు. డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10+ సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి. దీని వ్యూయింగ్ యాంగిల్ 178 డిగ్రీలుగా ఉండటం విశేషం. ఇక ఇందులో 30 వాట్స్ స్టీరియో స్పీకర్ సిస్టంను పొందుపరిచారు. రెండు ట్వీటర్లు, నాలుగు ఊఫర్లు ఇందులో అమర్చారు. డాల్బీ ఆడియో, డీటీఎస్ హెచ్‌డీ ఫీచర్స్ ను సపోర్ట్ చేస్తుంది. క్వాడ్ కోర్ 64 బిట్ ఏ55 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇన్ బిల్ట్ పొందుపరిచారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్‌లకు ప్రత్యేకమైన యాప్స్ జోడించారు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ అద్భుతంగా వర్క్ చేస్తుంది. ఇక ఇందులో బిల్ట్ ఇన్ మైక్రో ఫోన్ కూడా అమర్చారు. దీంతో వాయిస్ కమాండ్స్ ద్వారా టీవీని ఈజీగా కంట్రోల్ చేయవచ్చు.
ఈ టీవీ గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సాను సపోర్ట్ చేస్తుంది. ఇందులో బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఒక హెచ్‌డీఎంఐ 2.1 పోర్టు, రెండు హెచ్‌డీఎంఐ 2.0 పోర్టులు, రెండు యూఎస్‌బీ 2.0 పోర్టులు, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఏర్పాటు చేశారు. గేమర్లు, స్ట్రీమర్ల కోసం డెడికేటెడ్ ఆటో లో లేటెన్సీ మోడ్ ను కూడా ఇందులో పొందుపరిచారు. ఇక ఎంఐ క్యూఎల్ఈడీ టీవీ 75 ధర మనదేశంలో 1 లక్షా 19 వేల 999 రూపాయలుగా నిర్ణయించారు. ఇదే సైజులో మిగతా టీవీల ధరతో పోలిస్తే దీని ధర కాస్త తక్కువే అని చెప్పాలి. సో మరి ఈ స్మార్ట్ టీవీ కావాలంటే వెంటనే ఆన్ లైన్ లో బుక్ చేసకోండి.