‘5G’ నెట్ వర్క్ రాకముందే ఫోన్లు మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. చాలా దేశాల్లో ఇంకా 5G రానేలేదు.. అప్పుడే 6G ప్రస్తావనలు, ప్రశ్నలు, వివరాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చైనా మీడియా కథనాల ప్రకారం 6జీ నెట్ వర్క్ అందుబాటులోకి వస్తే.. ఆ స్పీడును అందుకోవడం అంత ఈజా కాదంటూ చెప్పుకొస్తున్నారు. ఎవరూ ఊహించలేనంత వేగంగా ఇంటర్నెట్ ను ఏలేయచ్చు అంటూ చెబుతున్నారు.
సౌత్ చైనా మార్నింగ్ పోస్టు రిపోర్టు ప్రకారం 6జీ టెక్నాలజీ 5జీ కన్నా 100 రెట్లు వేగంగా ఉంటుందని చెబుతున్నారు. 6జీ వైర్ లెస్ ట్రాన్సిషన్ స్పీడ్ సెకను 206.25 గిగా బైట్స్ గా ఉంటుందని వెల్లడించింది. అంటే అంతా ఇంతా స్పీడు కాదు.. 4కే క్వాలిటీలో మార్వెల్ సినిమాలన్నింటినీ చిటికెలో డౌన్ లోడ్ చేయచ్చు. మొత్తం 59.5 గంటల సనిమాలను కేవలం 16 సెకన్ల సమయంలోనే మీరు 6జీ టెక్నాలజీతో డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెబుతున్నారు.
China Claims Researchers Have Created 6G Tech That Is 100 Times Faster Than 5G.
206.25 gigabits per second. pic.twitter.com/n7o7FthVg1— AYUSHRAI (@AYUSHRA67843452) January 7, 2022
అయితే ఇంకా 5జీ సేవలు ప్రపంచంలోని చాలా దేశాల్లో అందుబాటులో లేవు. భారత్ లో 5జీ రావాలంటే ఇంకా చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. అయితే చైనా లెక్కల ప్రకారం దాదాపు 2030 కల్లా 6జీ సేవలు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. భారత్ లోనూ 6జీ సేవలు అందుబాటులోకి వస్తే బావుటుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూంపోల తెలిజేయండి.
#China has made a breakthrough in #6G mobile tech, 100X faster than #5G! pic.twitter.com/RemzeWeMbl
— Alvin Foo (@alvinfoo) January 8, 2022