హెల్త్ డెస్క్ – డిఫెన్స్ రీసెర్చ్ మరియు డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్.. టీఆర్ డీఓ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంయుక్తంగా ఆవిష్కరించిన 2డీజీ ఔషధం కరోనా రోగులకు సంజీవణి అని చెప్పవచ్చు. ఈనెల17న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఈ మందును ఢిల్లీలో విడుదల చేశారు. ఈ డ్రగ్‌ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లేబరేటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్‌తో పాటుగా హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రెడ్డిస్ ల్యాబరేటరీ తయారు చేసింది. ఇప్పటి వరకు కరోనాకు నిర్ధిష్టమైన ఔషధం లేకపోవడంతో.. కాస్త రోగ నిరోధక శక్తి ఉన్నవాళ్లు మాతరమే కోలుకుంటున్నారు. ఇక ఇప్పుడు డీఆర్ డీఓ, డాక్టర్ రెడ్డీస్ తయారు చేసిన 2డీజీ మందు కరోనా రోగులకు దివ్య ఔషధంగా పనిచేయనుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో కరోనా చికిత్సకు ఇటువంటి ఔషధాన్ని ఎవరు కనిపెట్టలేదు. మొట్టమొదటి సారి భారత్ లోనే ఈ ఔషధనాని విడుదల చేశారు. 2 డియాక్సీ గ్లుకోజ్ గా పిలవబడుతున్న ఈ మందుతో కరోనా రోగులు త్వరితగతిన కోలుకోవచ్చు. అసలు ఈ మందు ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఇది మొట్టమొదటి థెరప్యుటిక్ కరోనా డ్రగ్. దీనిని తీసుకోవడం వల్ల బాడీలో వైరల్ డెవెలప్‌మెంట్ ఆగిపోతుంది. అంతే కాకుండా ఆ ఔషధం ఊపిరితిత్తులకు ఆక్సిజన్ అవసరాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ ఔషధంపై క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించారు. ఈ 2డీజీ మందును గతంలో ట్యూమరస్ క్యాన్సర్ సెల్స్ కోసం ఉపయోగించే వారు. ప్రస్తుతం కరోనా రోగులకు ఈ మందు ఇవ్వడం ద్వార బాడీ ఆక్సిజన్‌లో కూడా ఇది మంచి సహాయం చేస్తుంది. బాడీలో మరింత ఎక్కువ ఆక్సిజన్ అవసరాన్నీ ఇది అదుపు చేస్తుంది. ఇప్పటి వరకు ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్ మరియు ఇతర ప్రాంతాలలో 110 పేషెంట్లను తీసుకుని క్లినికల్ ట్రయల్ నిర్వహించారు. ఈ మందును ఉపయోగించిన మూడవ రోజుకి రోగుల శరీరంరో ఆక్సిజన్ అవసరం తగ్గిందని క్లినికల్ ట్రయల్స్ లో తేలింది.
ఈ ఔషదాన్ని నోటి ద్వారా తీసుకోవాలి. రెండు గ్లాసుల నీళ్ళలో 2డీజూ పౌడర్ ను కలుపుకుని రోజుకు రెండు సార్లు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అవసరాన్ని బట్టి ఐదు నుండి ఏడు రోజుల పాటు దీనిని తీసుకోవడం వలన వైరస్ ను పూర్తిగా నిరోధించవచ్చని అంటున్నారు. ఈ ఔషధాన్ని మోడరేట్ నుండి తీవ్రంగా కరోనా వుండే వాళ్లకి వాడొచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. కరోనా తక్కువ లక్షణాలు ఉన్నవారికి ఈ మందు వాడాల్సిన అవసరం లేదని అన్నారు. అంతే కాదు కరోనా సోకిన వారు ఆ తరువాత బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. ఈ నేపధ్యంలో 2డీజీ ఔషధం బ్లాక్ ఫంగస్ బారిన పడకుండా కూడా నిరోధిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.