చెన్నై- ఆనందయ్య.. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఈ పేరు మారు మ్రోగి పోయింది. కరోనాకు ఆయుర్వేత మందును తయారుచేసి హాఠాత్తుగా సెలబ్రెటీ అయిపోయాడు ఆనందయ్య. ఆయన మందు వివాదం చెలరేగి, ఆఖరికి హైకోర్టు అనుమతితో ఆనందయ్య ఆయుర్వేద మందును రాష్ట్రవ్యాప్తంగా అందిస్తున్నారు. ఆనందయ్య ఆయుర్వేద మందు కరోనాకు పనిచేస్తుందని కొందరు, అంతా ఉట్టిదేనని మరి కొందు వాదిస్తున్నసమయంలో, తమిళనాడు అత్యున్నత న్యాస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఆనందయ్య ఆయుర్వేద మందుపై మద్రాసు హైకోర్టు సంచలన కామెంట్స్ చేసింది. ఆంద్రప్రదేశ్ లో కరోనాకు ఆయుర్వేత మందు తయారుచేసి ఉచితంగా ఇస్తున్నారంటూ ఆనందయ్యను హైకోర్టు అభినందించింది. ఈ సందర్భంగా ఆనందయ్యకు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్. కరుబాకరణ్, టీవీ తమిళ్ సెల్వీ సెల్యూట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన రక్షణ రంగ సంస్థ డీఆర్డీవో కరోనా చికిత్స కోసం తయారు చేసిన 2-డీజీ మందుపై విచారణ సందర్భంగా ఆనందయ్య మందు ప్రస్తావన వచ్చింది. ప్రభుత్వాలు ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహించడంలో విఫలమయ్యాయంటూ ఆనందయ్యపై అభినందనల వర్షం కురిపించారు న్యాయమూర్తులు.
కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేద వైద్యులను ప్రోత్సహించాలని జస్టిస్ ఎన్. కరుబాకరణ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. భారతీయ ఎడిసన్‌గా పేర్గాంచిన జీడీ నాయుడును ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. అలాంటి అత్యుత్తమ ఆవిష్కర్తలు కూడా ఆయుర్వేద వైద్యంలో ఉంటారని., అందరూ రామర్ పిళ్లై లాంటి మోసగాళ్లు ఉంటారన్న ఆందోళన వద్దని చెప్పింది మద్రాస్ హైకోర్టు.