స్పెషల్ డెస్క్- హైదరాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేసిన నిందితుడు రాజు రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కిందపడి రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. చిన్నారిపై జరిగిన అమానుష ఘటనపై ముందు నుంచి సీరియస్ అవుతున్న హీరో మంచు మనోజ్, నిందితుడి ఆత్మహత్య తర్వాత స్పందిస్తూ ఓ వీడియో సందేశం ద్వార స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.
ఈ విడియో సందేశంలో మంచు మనోజ్ ఏమన్నారంటే.. అందరికీ నమస్కారం.. ఆ రాక్షసుడికి ఇలా జరగాల్సిందే.. ఇలాంటి నీచమైన పని చేసిన ఎవ్వడికైనా ఇలాగే జరుగుతుంది.. ఇలాగే జరగాలి.. ఆ చిన్నారి తల్లి ఎక్కడున్నా తన ఆత్మ శాంతిస్తుందని, ఆ ఈశ్వరుణ్ణి కోరుకుంటున్నా.. ఆమె తల్లిదండ్రులకు కూడా ఈ రోజు ఓ చిన్న రిలీఫ్ వచ్చి ఉంటుంది.. కానీ ఏం చేసినా వాళ్ళ కూతురు తిరిగిరాదు.. ఈ రోజు ఓ ఆడ కూతురు ఉన్న ప్రతి పేరెంట్స్‌కి ఓ భరోసా వచ్చి ఉంటుంది.. ఇలా చేస్తే ఇలా ప్రతి ఒక్కరూ దాన్ని వ్యతిరేకించి ఇలా ముందుకొచ్చి మాట్లాడతారు..
ఫైనల్‌గా పోలీసు వాళ్ళు గానీ, గవర్నమెంట్ గానీ, మీడియా గానీ బాగా హెల్ప్ చేసి దీనికో ముగింపు తీసుకొచ్చారు.. ప్రతి ఒక్కరికీ పాదాభివందనం.. ఇంకో విషయం.. మన పిల్లలకి చిన్నప్పటి నుంచే ఆడవాళ్ళకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, అనేది ప్రతి పేరెంట్ గైడ్ చేయాలి.. మానవాళి తలదించుకునే ఇలాంటి క్రైమ్స్ జరగకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి.. తీసుకుంటారని కోరుకుంటున్నా.. అమ్మాయిని అసభ్యంగా వర్ణించే వారిని గుర్తించి వాళ్లపై ఓ కన్నేసి, వాళ్ళకు బ్రెయిన్ వాష్ చేయండి..
ఆదమరిచి ఉంటే అది ఎప్పుడు మీ ఇంటికి చేరుకుంటుందో మీకే తెలియదు.. ఓ గవర్నమెంట్, పోలీస్, సమాజమే కాదు.. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోండి.. మన పిల్లల ఫ్యూచర్ జనరేషన్ కోసం ప్రతి ఒక్క మనిషి జాగ్రత్తగా ఇలాంటివి గమనించాలి.. ఆడవాళ్ళకి మనమంతా అండగా ఉన్నాం అనే నమ్మకం ఇద్దాం.. మనందరం కలిసి బాధ్యత తీసుకుంటేనే ఇది జరుగుతుంది.. అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను.. చిన్నారి విషయంలో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం.. అంటూ మంచు మనోజ్ సందేశమిచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.