ఫిల్మ్ డెస్క్- మంచు లక్ష్మి.. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే, టీవీ షోలు చేయడంతో పాటు సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటుంది మంచి లక్ష్మి. సోషల్ మీడియాలో మంచు లక్ష్మికి యమ క్రేజ్ ఉంది. ఆమె ఈ పోస్ట్ పెట్టినా వెంటనే అది వైరల్ అయిపోతుంది. ఇప్పుడు కరోనా టైం కావడంతో పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు మంచులక్ష్మి. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గానే ఉంది.
తాజాగా మంచు లక్ష్మి ఫేస్ బుక్ లో షేర్ చేసిన ఫొటోలపై నెటిజన్స్ మండిపడుతున్నారు. అంతే కాదు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ ఫోటోల్లో అంతగా ఏముందనే కదా మీ సందేహం. మంచు లక్ష్మి ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కూతురు విద్యా నిర్వాణతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటుందని అందరికి తెలిసిందే. పలు సందర్భాల్లో తన కూతురుపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ చాలా ఫోటోలను షేర్ చేసింది మంచు లక్ష్మి. ఈ క్రమంలోనే తాజాగా తన భర్త, కూతురుతో కలిసి ఓ పార్టీకి వెళ్లిన మంచు లక్ష్మి ఆ ఫొటోలను షేర్ చేసింది.
చాలా రోజుల తరువాత నా అభిమాన వ్యక్తులతో కొన్ని ఆహ్లాదకరమైన వంటకాలను ఆస్వాదిస్తున్నా, పాత రోజులు మళ్లీ రావడం హ్యాపీగా ఉంది.. అంటూ కొన్ని ఫొటోలను షేర్ చేసింది మంచు లక్ష్మి. ఇంతవరకు బాగానే ఉన్నా, తన భర్తతో కలసి మద్యం సేవిస్తుండటం ఫొటోలలో క్లియర్ గా కనిపిస్తోంది. మందు పార్టీలు చేసుకోవడం తప్పులేదు, మధ్యం తాగడం కూడా వ్యక్తిగత విషయమే అనుకొండి, కానీ కూతుర్ని పక్కన పెట్టుకుని మందు తాగడంపైనే నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. అలా చిన్న పాపను ముందు మందు తాగితే వాళ్లు చెడిపోయే ప్రమాదం లేదా అని ప్రశ్నిస్తున్నారు, పిల్లలకు కూడా మందు అలవాటు చేస్తున్నారా.. అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. మరి దీనిపై మంచు లక్ష్మి మాత్రం స్పందించలేదు.