పెళ్ళైన స్త్రీకి అందం ఐశ్వర్యం మెడలో తాళిబొట్టు భర్త భార్యకి కట్టినప్పుడు వేద మంత్రాలతో ఆ తంతు జరుగుతుంది. భార్య మెడలో మంగళసూత్రం, నుదిటిన సింధూరం భర్త ప్రాణాలను సంతోషాలను కాపాడుతుంది. మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త తెలుసుకుని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలా చూసుకోవాలి. వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమైంది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుంచి పుట్టింది. పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో తాళి బొట్టు మాత్రమే కడతాడు. సంసారం నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో సాగాలని ఆ తర్వాత ఆడవారు మంగళ సూత్రంలో పగడాలు, ముత్యాన్నీ, చిన్న చిన్న విగ్రహాల్ని ధరిస్తారు.
ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే… ‘షార్దుల్ కదమ్’ అనే వ్యక్తి ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’లో ఫేస్‌బుక్ పేజీలో తన పెళ్లి గురించి వివరించాడు. కాలేజీలో చదువుతున్నప్పుడు తాను తనుజా అనే అమ్మాయిని ప్రేమించానని తెలిపాడు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో హిమేష్ రెషమ్మియా పాటను పోస్టు చేసి ‘టార్చర్’ అని క్యాప్షన్ పెట్టింది. దాని షార్దుల్.. ‘మహా టార్చర్’ అని కామెంట్ చేశాడు. అప్పటి నుంచి వారి మధ్య మాటలు మొదలై ప్రేమ చిగురించింది. కోవిడ్-19 ఇండియాలో అడుగుపెడుతున్న సమయంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. అయితే, తన పెళ్లి చాలా భిన్నంగా జరిగిందని షార్దుల్ తెలిపాడు. ఈ పెళ్లిలో వధువుతోపాటు తాను కూడా మంగళసూత్రం ధరించానని తెలిపాడు. మంగళసూత్రం భార్య మెడలోనే ఎందుకు ఉండాలి? నా దృష్టిలో ఇద్దరూ సమానమే. అందుకే తాళి కట్టించుకున్నా’’ అని పేర్కొన్నాడు. ఈ పోస్టు నెటిజనులు షార్దుల్‌ను ట్రోల్ చేస్తున్నారు. మంగళసూత్రంతోపాటు చీర కూడా కట్టుకుని కూర్చోవలసిందని కామెంట్లు చేస్తున్నారు. మన సాంప్రదాయాలపై గౌరవం ఉంటే ఇలాంటి పనులు చేయొద్దని, పెళ్లంటే చాలా అందమైన వేడుక అని మరికొందరు అంటున్నారు.