బైకు నడిపెట్టప్పుడు హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి చావు నోట్లోకి వెళ్లి బయటపడ్డ ఘటన గుజరాత్‌లో చోటు చేసుంది. దంపతులిద్దరూ బిడ్డతో బైక్‌పై వెళ్తున్నారు. వర్షాలు పడి రోడ్డు నీళ్లు ఆగి ఉన్నాయి. వెళ్తున్న మార్గంలో ఉన్న గుంత కనిపించలేదు. అందులో బైక్ గుద్దుకుని పక్కకు పడ్డారు. ఎదురుగా వస్తు పక్కనుంచే వెళ్తున్న ట్రాక్టర్ వెనుక టైరు అతని తలపై నుంచి వెళ్లింది. అతను హెల్మెట్ ధరించడంతో ప్రాణాలతో బయట పడ్డాడు. లేకుంటే తల ఛిద్రమయ్యేది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ ప్రమాద దృశ్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
પાણીમાં ગમે ત્યાં વાહન ચલાવતા પહેલા ચેતી જજો
દરેક વખતે આમની જેમ નસીબ તમારો સાથ નહી આપે
દાહોદમાં બાઈક પર જઈ રહેલા પરિવારનો અદભૂત બચાવ #Gujarat #GujaratRains #accident #CCTV #Video @CollectorDahod #Dahod #હવે_બદલાશે_ગુજરાત pic.twitter.com/gakMZxkpMX
— Sanjay Desai 🇮🇳 {News18 Gujarati} (@sanjay_news18) September 15, 2021