ఫిల్మ్ డెస్క్- ఆర్ఆర్ఆర్.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచానాలు నెలకొన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో రాంచరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతుంటోంది. సంకాత్రి కానుకగా వచ్చే యేడాది జనవరి 7న ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ కు సంబందించిన ఒక్కో అంశాన్ని రివీల్ చేస్తూ క్రేజ్ ను పెంచారు రాజమౌళి.
ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ మూవీకి సంబందించిన మరో గ్లింప్స్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. సోమవారం ఉదయం విడుదలైన ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ ప్రస్తుతం నెట్టింట్లో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అంతా ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ గురించే చర్చించుకుంటున్నారు. ఆ షాట్స్, ఆ గ్రాండియర్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా అదిరిపోయని వేరే చెప్పక్కర్లేదు. తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్‌తో ఆర్ఆర్ఆర్ మరో సారి ట్రెండింగ్ అవుతోంది.తాజాగా ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. విజువల్స్ చూసి దిమ్మతిరిగిపోయింది.. అదిరిపోయిందంతే.. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తానా.. అని ఆత్రుతగా ఉంది.. అంటూ మహేష్ బాబు ట్వీటేశారు. అన్నట్లు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.
ఐతే ఈ సినిమాకు కథ మాత్రం ఇంకా పూర్తి కాలేదని కధా రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలో చెప్పారు.ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో, ఓ అడ్వంచరస్ కథ రాయాలని అనుకుంటున్నట్టు విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇంకేముంది రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ రాబోతున్న సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా పనులు పూర్తై, ఈ సినిమా విడుదల ఐతే, ఆ తరువాత మహేష్ బాబు సినిమాకు సంబంధించిన కథపై దృష్టి పెట్టనున్నారు రాజమౌళి.
Blown away by the spectacular visuals! Just wow.. stunning!! Can’t wait to watch the film #RRRhttps://t.co/22dBLwyLNk@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08
— Mahesh Babu (@urstrulyMahesh) November 1, 2021