ఫిల్మ్ డెస్క్- సితార ఘట్టమనేని.. తెలుసు కదా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతల ముద్దుల కూతురు. ఆట, పాటల్లోనే కాదు.. సోషల్ మీడియాలోను సితార చాలా యాక్టీవ్ గా ఉంటుంది. అన్న గౌతమ్ తో పాటు, కుటుంబానికి సంబందించిన అన్ని అంశాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది సితార. ఇదిగో ఇప్పుడు సర్కారు వారి పాట షూటింగ్ కోసం మహేష్ తో సహా టీం అంతా గోవా వెళ్లింది.
సర్కారు వారి పాట బ్లాస్టర్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో టీంలో మంచి ఊపు వచ్చింది. ఇంకేముంది వెంటనే గోవాలో అదిరిపోయే షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఈ క్రమంలో మహేష్ ఫ్యామిలీతో పాటు, డైరెక్టర్ పరుశరాం కుటుంబం కూడా గోవా వెళ్లింది. ఈ సందర్బంగా సితార అందుకు సంబందించిన కొన్ని ఫోటోలను, విశేషాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
గోవా ప్రయాణం ఎలా సాగింది, తామంతా గోవా ఎలా వెళ్లింది సితార ఇన్ స్టాగ్రామ్ ద్వార చెప్పింది. కేవలం సినిమా షూటింగ్ లా కాకుండా, ఇది ఫ్యామిలీ వెకేషన్‌లానూ ఉండబోతోందని సితార ఆనందం వ్యక్తం చేసింది. గతంలో దుబాయ్ షెడ్యూల్ కూడా ఇలానే సరదాగా సాగిందని గుర్తు చేసింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు, పరుశురాం కుటుంబాలు స్పెషల్ ఫ్లైట్‌లో గోవాకు బయల్దేరినట్టు ఫోటోలు చూస్తే తెలుస్తోంది.
ఈ స్పెషల్ ఫ్లైట్ లోనూ నాన్నకు సంబంధించిన కేకులు దొరికాయంటూ.. సితారా ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నట్లు సర్కారు వారి పాట సినిమాను సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.