ఫిల్మ్ డెస్క్- మహేష్ బాబు.. ఈ టాలీవుడ్ సూపర్ స్టార్ కు ప్రేక్షకుల్ల ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం సినిమాల్లో నచించడమే కాకుండా, కమర్షియల్ యాడ్స్ తో పాటు ఏఎంబీ పేరుతో గచ్చిబౌలిలో మల్టిప్లెక్స్ ధియోటర్ల్ కూడా నడుపుతున్నారు. త్వరలోనే సూపర్ స్టార్ బ్రాండ్ తో షర్స్ట్ బిజినెస్ లోకి కూడా మహేష్ బాబు ఎంటర్ అవుతున్నారని టాక్.
ఇదిగో ఇటువంటి క్రమంలో మహేశ్ బాబు మరో కొత్త ఇంటి నిర్మాణంపై దృష్టి సారించారు. అందుకోసం హైదరాబాద్ లోనే అత్యంత ఖరీదైన ప్రాంతం జూబ్లీహిల్స్‌లో ఓ ప్లాటు కొనుగోలు చేశారట మహేష్ బాబు. ఈ మేరకు ప్రముఖ బిజినెస్ వెబ్‌సైట్ మనీ కంట్రోల్ ప్రత్యేకమైన కధనాన్ని ప్రచురించింది. దీంతో మహేష్ కొనుగోలు చేసిన ఇంటి స్థలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
యర్రం విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి నుంచి మహేశ్ బాబు 1442 గజాల ప్లాటును కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇందుకు గాను మహేశ్‌బాబు ఏకంగా 26 కోట్ల రూపాయలను చెల్లించారని సమాచారం. ఇందులో స్టాంప్ డ్యూటీ కింద 1.43 కోట్లు, ట్రాన్స్ ఫర్ డ్యూటీ కింద 39 లక్షలు చెల్లించారట. 2021 నవంబరు 17న ఈ సేల్ డీడ్ జరిగినట్టు మనీ కంట్రోల్ పేర్కొంది.
జూబ్లీహిల్స్‌లో నివాస స్థలాకు సంబంధించి సగటున ఒక్కో ప్లాటు సుమారు వెయ్యి చదరపు గజాల విస్తీర్ణంలో ఉంటాయి. ఇక్కడ గజం భూమి ధర 1.50 లక్షల నుంచి 2 లక్షల వరకుగా ఉంది. ఇక మహేశ్‌బాబు కొనుగోలు చేసిన స్థల గత యజమాని అయిన యర్రం విక్రాంత్ రెడ్డి, ఈ స్థలంలో ఉన్న పాత ఇంటిని కూల్చేసి కొత్త ఇళ్లు కట్టాలని ముందుగా అనుకున్నారట. అయితే కొత్త నిర్మాణ పనులు చేపట్టకుండా, ఈ ఇంటి స్థలాన్ని మహేశ్‌బాబుకు అమ్మేశారు. ఈ స్థలంలో విలాసవంతమైన విల్లాను నిర్మించనున్నారు మహేష్ బాబు.