ఫిల్మ్ డెస్క్- అజయ్ భూపతి తెలుసు కదా.. అదేనండీ ఈ మధ్య ఆర్ ఎక్స్ 100 సినిమా తీసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. హా ఇప్పుడు గుర్తుకు వచ్చాడు కదా. ఆర్ ఎక్స్ 100 లాంటి హిట్ సినిమా తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న మరో డ్యూయెల్ లవ్ స్టోరీ మహా సముద్రం. సిద్ధార్ధ, శర్వానంద్, అను ఇమ్మాన్యుయేల్, అదితీరావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది.
ఈ క్రమంలో మహా సముద్రం సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్ని మొదలుపెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా ఇప్పటి వరుకూ విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాలోని మరో లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాట కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. హే.. తికమక మొదలే.. ఎదసొద వినదే.. అనుకుందే తడవా.. ఇక నచ్చినచ్చి పిచ్చిపట్టి.. అంటూ సాగే పాటను రెండు జంటల ప్రేమగీతంగా రిలీజ్ చేశారు.
సిద్ధార్ధ్, అదితీరావు హైదరి, శర్వానంద్, అనూ ఇమ్మాన్యుయేల్ ల ప్రేమకథల్ని పరిచయం చేయడమే ఈ లిరికల్ సాంగ్ స్పెషల్. ఈ పాటను గీత రచయిత కిట్టు విస్సాప్రగడ రాయగా, చేతన్ భరద్వాజ్ సంగీతం అందిచారు. హరిచరణ్, నూతనా మోహన్ పాడిన ఈ పాట యువతను బాగా ఆలరిస్తోంది. మహా సముద్రం సినిమాలో రావు రమేశ్, జగపతి బాబు, గరుడ రామ్, శరణ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై సిధ్దార్ధ్, శర్వానంద్ బాగా ఆసలు పెట్టుకున్నారు. ఆర్ ఎక్స్ 100 సినిమా లాగే మహా సముద్రం సినిమాను కూడా డైరెక్టర్ అజయ్ భూపతి రొమాంటిక్ లవ్ స్టోరీతో బాగా తెరకెక్కించారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. మరి ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.