ఫిల్మ్ డెస్క్- జై భీమ్.. తమిళ స్టార్ నటుడు సూర్య నటించిన ఈ సినిమా దక్షిణాది బాషలన్నింటిలో విడుదలైంది. జై భీమ్ సినిమా చుసిన వాళ్లందరు హీరో సూర్య గురించి ఏమో గానీ, సినతల్లి పాత్ర వేసిన లిజోమోల్ జోస్ గురించి మాత్రం ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే జై భీమ్ సినిమాలో సినతల్లి పాత్రే చాలా కీలకం. ఇక ఈ పాత్రలో లిజోమోల్ జోస్ నటన అదిరిపోయిందని చెప్పవచ్చు.
లిజోమోల్ జోస్ జై భీమ్ సినిమాలో సినతల్లి పాత్రలో అద్భుతంగా నటించింది. ఆమె నటన చూసిన ప్రేక్షకులు ఆహా.. ఓహో అనకుండా ఉండలేకపోతున్నారు. సూర్య లాంటి స్టార్ హీరో ఉన్నా కూడా ఈ కేరళ బ్యూటీ నటనకు అంతా మైమరచిపోతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. లిజోమోల్ గ్లామరస్ పాత్రల్లో నటించి ఆకట్టుకోలేదు. కానీ డీగ్లామర్ లుక్ లో, అదీ నిండు గర్భణిగా తన నటనతో అందరిని మైమరిపించింది.
లిజోమోల్ కేవలం పర్ఫామెన్స్ తోనే కాకుండా, తన లుక్స్ విషయంలోనూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. లిజోమోల్ మొన్నా మధ్య హీరో సిద్ధార్థ్ సరసన ఒరేయ్ బామ్మర్ది అనే డబ్బింగ్ సినిమాలో నటించింది. ఐతే ఆ సినిమాలో లిజోమోల్ ను చూసిన వారు, జై భీమ్ లో సినతల్లిగా నటించిందంటే అస్సలు నమ్మలేకపోతున్నారు. ఆమె రూపంతో, నటనతో, ప్రతిభతో అందరిని మరో లోకంలోకి తీసుకెళ్లింది లిజోమోల్.
కేరళ రాష్ట్రానికి చెందిన లిజోమోల్ జోస్ ది మధ్యతరగతి కుటుంబం. కొన్నాళ్లపాటు ఓ టీవీ ఛానల్లో లిజో ఉద్యోగం చేసింది. ఫాహద్ ఫాజిల్ నటించిన మహేశింటే ప్రతీకారం సినిమా రూపంలో లిజోకు ఫస్ట్ ఛాన్స్ దక్కింది. నటుడు అరుణ్ ఆంటోనీని ఇటీవల పెళ్లాడిన 29 ఏళ్ల లిజోమోల్ కెరీర్ లో, పలు సూపర్ హిట్ సినిమాలున్నాయి. చాలా మంది జై భీమ్ చూసిన తర్వాత ఒరేయ్ బామ్మర్దిలో నటించిన లిజోనేనా అనుకుంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.