నాలుగేళ్ల క్రితం టాలీవుడ్ ను డ్రగ్స్ ప్రకంపనలు రేగాయి. ఇందులో పెద్ద పెద్ద వారి పేర్లు వినిపించాయి. వారంతా విచారణని కూడా ఎదుర్కొన్నారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆ విచారణ జరిపింది. కానీ.., అందులో ఎలాంటి ఆధారాలు లభించకపోవడం, అధికారుల నుండి వచ్చిన ఒత్తిడులు కారణంగా ఎక్సైజ్ శాఖ ఈ వ్యవహారంలో సైలెంట్ అయిపోయింది. అయితే.., ఎవరు ఎన్ని అడ్డంకులు ఏర్పరిచినా చట్టం తనపని తాను చేసుకుంటూ వెళ్ళిపోద్ది కదా..? అలా అనుకోకుండా ఈడీ రంగంలోకి దిగింది. మళ్ళీ 12 మంది సెలబ్రెటీలకు నోటీసులు పంపింది. విచారణకి రావాలని ఆదేశించింది.
ఈడీ సినీ ప్రముఖులకి నోటీసులు ఇవ్వడం నా మాత్రంగా జరిగిన అంశంగా కనిపించడం లేదు. ఈ నోటీసులు ఇవ్వడానికి సుమారు 6 నెలల ముందే ఈడీ కెల్విన్ పై కేసు నమోదు చేసింది. ఎక్సైజ్ శాఖ ఇచ్చిన ఆధారాలను ఆధారంగా చేసుకుని ఈడీ ఈ కేసు నమోదు చేసింది. ఈ 6 నెలల కాలంలో ఈడీ కెల్విన్ ని సుమారుగా 12 సార్లు విచారణ చేసింది. ఇదే సమయంలో కెల్విన్ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అయ్యాయి.
ఈ ప్రెజర్ తట్టుకోలేకనే కెల్విన్ అప్రూవర్ గా మారి.., మొత్తం చిట్టా బయట పెట్టినట్టు తెలుస్తోంది. కెల్విన్ బ్యాంక్ అకౌంట్స్ లోని లావాదేవీలను ఆధారంగా చేసుకునే.. ఈడీ ఈ 12 మంది సెలబ్రెటీలకు నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. నగదు బదిలీ అంశంపైనే వీరంతా ఎక్కువగా ప్రశ్నలు ఎదుర్కోనున్నారు. ఈ మొత్తం విచారణ పూర్తి అయ్యాకనే అసలు నిజాలు బయట పెడతామని అధికారులు తెలియచేస్తున్నారు. ఒకవేళ కెల్విన్ ఇచ్చిన లిస్ట్ లో గనుక టాలీవుడ్ సెలబ్రెటీలు ఎవరైనా ఉంటే వారికి గడ్డు కాలం తప్పదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఏ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.