కర్ణాటకలోని దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు 85 ఏళ్ల వృద్దురాలిని చంపి శవంపై అత్యాచారం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది.
దేశంలో జరుగుతున్న దారుణాలు, ఘోరాలు వింటుంటే అసలు మనం మనుషుల మధ్యే బతుకుతున్నామా అనే అనుమానం కలగక మానదు. ప్రభుత్వాలు నిర్భయ, దిశ వంటి కఠినమైన చట్టాలు రూపొందించినా దుర్మార్గుల ఆలోచనల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఐదేళ్ల చిన్నారుల నుంచి 80 ఏళ్ల పండు ముసలవ్వల వరకూ ఇలా ఎవరినీ వదలకుండా కామంతో అత్యాచార దాడులకు తెగబడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ యువకుడు 85 ఏళ్ల వృద్దురాలిని చంపి శవంపై అత్యాచారం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది.
పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని అర్సికెరె పరిధిలోని ఎరెహళ్లి గ్రామం. ఇక్కడే మిథున్ కుమార్ (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 1న గ్రామంలోని 85 ఏళ్ల వృద్దురాలు తన పొలం నుంచి సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంది. ఈ క్రమంలోనే అటు నుంచి మిథున్ కుమార్ బైక్ పై వస్తున్నాడు. ముసలవ్వ ఒంటరిగా వస్తుండడం చూసిన ఈ కిరాతకుడు.. నిన్ను ఇంటి దగ్గర వదిలిపెడతా అని నమ్మించి తన బైక్ ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత మెల్లగా ఆ బైక్ ను ఊరి వైపు కాకుండా చెట్ల పొదల్లాకి తీసుకెళ్లాడు.
ఇక ఓ చోట బైక్ ఆపి ఆ వృద్దురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీనికి ఆ ముసలవ్వ నిరాకరించడంతో మిథున్ కుమార్ అక్కడే ఉన్న ఓ రాయితో ఆ వృద్దురాలి తలపై మోది హత్య చేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న మిథున్.. ఆ తర్వాత ముసలవ్వ శవంపై దారుణంగా ఆత్యాచారం చేశాడు. అనంతరం ఈ దుర్మార్గుడు అటు నుంచి మెల్లగా ఇంటికి జారుకున్నాడు. ఆ రోజు రాత్రి ఆ వృద్ధురాలు ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఊరంతా వెతికారు. కానీ, ఆమె జాడ మాత్రం కనిపించలేదు. ఇక చేసేదేం ఆ వృద్ధురాలి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ముసలవ్వ ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. ఊళ్లోని ఓ చెట్ల పొదల్లో వృద్దురాలి మృతదేహం నగ్నంగా కనిపించింది. ఆ సీన్ చూసిన పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అనంతరం పోలీసులు కొందరు అనుమానితులను విచారించగా ఎట్టకేలకు మిథున్ కుమార్ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. అతడు చేసిన నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచనలంగా మారింది. 85 ఏళ్ల వృద్ధురాలిని చంపి ఆపై తన కామాన్ని తీర్చుకున్న ఈ దుండగుడి కిరాతకంపై మీ అభిప్రాయాలను కామంట్ రూపంలో తెలియజేయండి.