తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పేపర్ లీకేజ్ ఎంతటి సంచలనం కలిగించిందో అందరికీ తెలుసు. ఈ పేపర్ లీకేజ్ అంశం రాష్ట్ర్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా తాము కొన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సడెన్ ప్రకటన చేసింది ఓ విద్యా సంస్థ. అయితే పరీక్ష వాయిదా వేయడానికి కారణాలు చెప్పకపోవడంతో పలు అనుమానాలకు తావునిచ్చినట్లయింది.
విద్యార్థులకు అలర్ట్. జవహర్‌లాల్ నెహ్రు టెక్నాలజికల్ యూనివర్శిటీ (జెఎన్టీయూ హైదరాబాద్) పరిధిలో పలు పరీక్షలు రద్దు అయ్యాయి. ఈ మేరకు యూనివర్శిటీ అధికారిక ప్రకటన చేసింది. ఈ నెల 17 నుండి అంటే శుక్రవారం నుండి జరగాల్సిన బీటెక్ మొదటి ఏడాది సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసింది. వీటితో పాటు సప్లమెంటరీ పరీక్షలు కూడా వాయిదా పడినట్లు పేర్కొంది. ఈ సమాచారాన్నిలేఖల ద్వారా ఈ యూనివర్శిటీ పరిధి కిందకు వచ్చే అనుబంధ కాలేజీలకు పంపింది జెఎన్టీయూహెచ్. ఈ పరీక్షలను ఈ నెల 27వ తేదీ నుండి తిరిగి నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ పరీక్షలు వాయిదా పడటానికి కారణాలను మాత్రం యూనివర్శిటీ వెల్లడించలేదు. ఈ చర్యతో విద్యార్థులు సైతం కొంత గందరగోళానికి ఎదుర్కొంటున్నారు.
ఇప్పుడు తెలంగాణాను పరీక్షా పేపర్ల లీకేజ్ బెడద వెంటాడుతుంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పేపర్ లీకేజ్ ఎంతటి సంచలనం కలిగించిందో అందరికీ తెలుసు. ఈ పేపర్ లీకేజ్ అంశం రాష్ట్ర్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టీఎస్పీఎస్సీ పరిధిలో ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సిన పరీక్షలు కూడా రీషెడ్యూల్ అయ్యే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. దీంతో హైదరాబాద్ జెఎన్టీయూ (JNTUH) కూడా పరీక్షలు వాయిదా వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆకస్మాత్తుగా బిటెక్ తొలి ఏడాది పరీక్షలను వాయిదా వేస్తూ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అయితే వాయిదా వెనుక కారణాలు వెల్లడించకపోవడంతో పలు అనుమానాలకు తావునిచ్చినట్లయింది. పేపర్ లీకేజ్, పరీక్షలు వాయిదా పడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.