మహేంద్ర సింగ్ ధోని.. ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్. ధోని కెప్టెన్సీ లోనే ఇండియా వన్డే వరల్డ్ కప్, టీ-20 వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. కేవలం కెప్టెన్ గా మాత్రమే కాదు.. బ్యాట్సమెన్ గా, వికెట్ కీపర్ గా ధోని మెరిపించే మెరుపులు మాములుగా ఉండవు. ఇంత పవర్ ప్యాక్ ప్లేయర్ కాబట్టే.. ఐపీఎల్ లో ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఇప్పటికీ వదుకోవడం లేదు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 రెండో దశ మ్యాచ్స్ కోసం ధోని ఇప్పటికే దుబాయ్ లో దిగిపోయాడు. చెన్నై టీమ్ లో అందుబాటులో ఉన్న ప్లేయర్స్ తో కలసి ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాడు.
నిజానికి ఐపీఎల్ 2021 మొదటి దశ మ్యాచ్ లలో ధోని దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. అయితే.., ఈసారి అలాంటి పొరపాట్లు జరగకూడదనే ధోని నెట్స్ లో తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ధోని నెట్ బౌలర్స్ బౌలింగ్ లో భారీ సిక్స్ లు కొట్టాడు. మహేంద్ర సింగ్ ధోని నెట్స్ లో రెచ్చిపోయి వరుసగా సిక్స్ లు కొట్టడంతో.. టీమ్ మేనేజ్మెంట్ ధోని ప్రాక్టీస్ సెషన్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో.., ఈ వీడియోని చూసిన ఫ్యాన్స్ ధోని ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ 2021 మొదటి దశ మ్యాచ్ ల వరకు చెన్నై టీమ్ పాయింట్ల పట్టికలో మంచి స్థానంలోనే ఉంది. మొత్తం 7 మ్యాచ్‌లాడిన చెన్నై.. ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.., అత్యధిక విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి స్థానంలో కొనసాగుతోంది.