తల్లి అయ్యే మధుర క్షణాల కోసం ఆ మహిళ ఎంతో ఎదురు చూసింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సంతోషంగా బిడ్డను తన చేతుల్లోకి తీసుకుని మురిసిపోయింది. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఆ వెంటనే ఆ మహిళ వికలాంగురాలు అయ్యింది. అసలేం జరిగింది.. అంటే
మాతృత్వం మహిళకు దేవుడిచ్చిన గొప్ప వరంగా చెబుతారు. వివాహమైన ప్రతి మహిళ.. బిడ్డలను కనడానికి, అమ్మ అనే పిలుపు వినడానికి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ కూడా బిడ్డ కోసం అలానే పరితపించింది. గర్భం దాల్చిన దగ్గర నుంచి పుట్టబోయే బిడ్డ గురించే ఆమె ఆలోచనలు. చిన్నారిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి.. తన కోసం ఏమేం చేయాలో అన్ని ఇప్పటి నుంచే ఆలోచించసాగింది. బిడ్డకు జన్మనిచ్చి.. చిన్నారిని తన పొత్తిళ్లలోకి తీసుకోబోయే క్షణం కోసం ఎంతో ఆశగా ఎదురు చూడసాగింది. అయితే ఆమె ఆనందం క్షణాల్లో ఆవిరయ్యింది. బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి వెంటనే వికలాంగురాలు అయిపోయింది. కన్న బిడ్డను చేతుల్లోకి తీసుకుని.. లాలించే భాగ్యం కొల్పోయింది. ఇంతకు ఏం జరిగింది అంటే..
ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. క్రిస్టినా పచెకో అనే మహిళకు ఈ భయంకర అనుభవం ఎదురయ్యింది. ఇంతకు ఏం జరిగింది అంటే.. క్రిస్టినా పచెకో కొన్ని రోజుల క్రితం రెండో బిడ్డకు జన్మనిచ్చింది. సీజెరియన్ ద్వారా డెలివరీ చేశారు. ఆపరేషన్ చేసిన రెండు రోజులు తర్వాత ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఇక ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమెకు కాస్త అనారోగ్యంగా అనిపించసాగింది. దీని గురించి తనకు సర్జరీ చేసిన ఆస్పత్రి వైద్యులను సంప్రదించగా.. ఓ ఇంజక్షన్ కూడా చేశారు. అయినా ఆమె పరిస్థితిలో మార్పు లేదు. పైగా విపరీతైమన జ్వరం వచ్చి.. చాలా నీరసించిపోయింది.
క్రిస్టినా పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. క్రిస్టినాను పరీక్షించిన వైద్యులు.. ఆమె శరీరం ఇన్‌ఫెక్షన్‌కి గురైందని.. గుర్తించారు. అంతేకాక ఇన్‌ఫెక్షన్ క్రిస్టినా కాళ్లు, చేతులకు వ్యాపించిందని.. ఆలస్యం చేయకుండా వెంటనే సర్జరీ చేసి.. ఇన్‌ఫెక్షన్ సోకిన భాగాలను తొలగించాలని.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు హెచ్చరించారు. ఇక చేసేదేం లేక.. ఇన్‌ఫెక్షన్‌ను గురైన శరీర భాగాలను తొలగించేందుకు క్రిస్టినా కుటుంబ సభ్యులు అంగీకరించారు. దాంతో వైద్యులు ఆమె చేతులను మోచేతి వరకు.. అలానే పాదాలను తొలగించారు. సుమారు నాలుగు నెలల పాటు ఆమె ఆస్పత్రిలోనే ఉంది.
బిడ్డల ఆలనా పాలనా చూసుకుంటూ సంతోషంగా గడపాల్సిన వయసులో.. కాళ్లు, చేతులు కోల్పోయి.. వికలాంగురాలిగా.. తానే మరొకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది క్రిస్టినాకు. ఈ సందర్భంగా మె మాట్లాడుతూ.. నా జీవితంలో నేను ఎదుర్కొన్న అత్యంత భయానక అనుభవం ఇదే. ఆస్పత్రిలో చేరిన రోజు ఏం జరిగిందో నాకు గుర్తు లేదు. నా బిడ్డల ఏడుపు మాత్రమే నాకు వినిపించింది. అదే నా చెవుల్లో మారుమోగుతుంది. కానీ నేను లేవలేకపోయాను. దేవుడి దయ వల్ల ప్రాణాలు మిగిలాయి. అది చాలు. నా ఇద్దరు బిడ్డలను బాగా చూసుకుంటాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఈ విషాద సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.