నిత్యం మనం అనేక రకాల ప్రమాదాలు చూస్తుంటాము. ఆ ప్రమాదాలోని బాధితులు తమని రక్షించమని ప్రాధేయపడుతుంటారు. చాలా మంది జరుగుతున్న ప్రమాదాన్ని చూస్తునే ఉంటారు కానీ.. అందులోని వారిని కాపాడే ప్రయత్నం చేయరు. కారణం వారి ప్రాణాలు పోతాయనే భయం. కానీ కొందరు మాత్రం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బాధితులను రక్షిస్తారు. అలాంటి వారిని దేవుడు అంటారు. తాజాగా అగ్నిప్రమాదంలో ఉన్న భవనం నుంచి ఓ యువతిని తమ ప్రాణాలకు తెగించి మరి కాపాడారు ఇద్దరు యువకులు. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇది చదవండి : ఆమెని 5 ఏళ్ళుగా శారీరకంగా వాడుకుని.. మరో యువతితో!
వివరాల్లోకి వెళితే.. రష్యాలోని మాస్కోలోని డోరోజ్నాయ స్ట్రీట్ లోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దాంతో ఆ భవనాన్ని నల్లటి పొగలు కమ్మేశాయి. ఈ సమయంలో ఓ యువతి రక్షించడానికి ఇద్దరు యువకులు తమప్రాణాలను పణంగా పెట్టారు. ఆ కిటికీలలోని ఒకదాని నుంచి ఆ యువతి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. కింద అంతస్తులో ఉన్న యువకులు ఆమెకు సహాయం చేస్తున్నారు. చివరకు ఆమెను అగ్ని ప్రమాదం నుంచి కాపాడారు. ఆ క్రమంలో ఆ ఇద్దరు యువకులు కూడా గాయపడ్డారు.
ఇది చదవండి : నాన్నే.. నన్ను ఇంట్లోంచి గెంటేశాడు: నటి
ఈ సంఘటను ఎవరో చాలా దూరం నుంచి వీడియో తీసి నెట్టింట్లో పెట్టారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని, ఇంట్లో నుంచి 12 మందిని రక్షించారని, వారందరినీ వైద్యులు పరీక్షించారని స్థానిక మీడియా రెన్ టీవీ పేర్కొంది. ఆ అమ్మాయిని కాపాడిన ఇద్దరు యువకులను రష్యా మంత్రిత్వ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. మరి ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.