అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లు రోజు రోజుకు చెలరేగిపోతున్నారు. ఎవరూ కూడా ఊహించని దారుణాలకు పాల్పడుతు ఆ దేశ ప్రజలకు వెన్నులో వణుకు పుట్టించేలా చేస్తున్నారు. ఇప్పటికే అక్కడి మహిళలను శారీరకంగా వేధిస్తూ అత్యాచారాలకు తెగబడుతున్నారు. దీంతో వీరి భయంతో మహిళలు రోడ్డెక్కాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితులను సృష్టిస్తున్నారు. ప్రస్తుతం తాలిబన్లు చేస్తున్న ఘోరాలకు అక్కడి మానవాళికి చుక్కలు కనిపిస్తున్నాయి.
తాజాగా ఘోరాతి ఘోరంగా ప్రవర్తిస్తూ ఏకంగా ట్రాన్స్ జెండర్లను సైతం వదలకుండా వారిపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. ఇక అంతటితో ఆగకుండా రేప్ చేసి చంపేస్తున్న ఘటనలు కళ్లకు కడుతున్నాయి. తాజాగా హనాన్ అనే గే పై తాలిబన్లు అత్యాచారానికి పాల్పడి ఆపై చంపేసిన ఘటన కళ్లముందు కదలాడుతోంది. తాజాగా జరిగిన ఈ ఘటనతో అక్కడి ట్రాన్స్ జెండర్ల భయంతో గజగజ వణికిపోతున్నారు. హనాన్ ముందుగా అఫ్ఘాన్ నుంచి బయటపడేందుకు సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ వ్యక్తిని సాయం అడిగాడు.
దీంతో అతను కూడా హనాన్ ను నమ్మించే ప్రయత్నం చేశాడు. దీంతో హనాన్ నమ్మి అతడి సాయంతో ఎలాగో అఫ్ఘాన్ నుంచి బయటపడాలనుకున్నాడు. ఈ తరుణంలోనే చివరికి హనాన్ నమ్మిన వ్యక్తి తాలిబన్ కు చెందినవాడని గ్రహించలేకపోయాడు. దీంతో వాళ్లు రమ్మన్న చోటుకు వెళ్లిన హనాన్ కు జరగబోయే దారుణ ఘటనను ఊహించలేకపోయాడు. దీంతో వచ్చిన వెంటనే ఆ ఇద్దరు తాలిబన్లు హనాన్ ని తీవ్రంగా కొట్టారు. ఇంతటితో ఆగకుండా అత్యాచారానికిని తెగబడి చంపేశారు. దీంతో ఈ వార్త తెలుసుకున్న అక్కడి ట్రాన్స్ జెండర్లు ఏం చేయాలో తెలియక తికమకలో ఉన్నారు. ఇక తాలిబన్లు సృష్టిస్తున్న ఇలాంటి అరాచకాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.