పైకి గంభీరంగా కనిపించినా.. ఉక్రెయిన్‌తో యుద్ధం రష్యాకు భారంగా మారింది. ప్రపంచ దేశాలన్ని.. రష్యా నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. యుద్ధం మానుకోవాలని సూచించాయి. అయినప్పటికి.. ఎవరి మాట వినడం లేదు పుతిన్. దీంతో చాలా దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే సోషల్ నెట్వర్కింగ్ సైట్లతో పాటు ఎంటర్టైన్మెంట్ సైట్లు కూడా అక్కడ బంద్ అయ్యాయి.
ఇప్పటి వరకు రష్యాపై సుమారు 5వేలకుపైగా ఆంక్షలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు పుతిన్ తీసుకున్న నిర్ణయానికి ఫలితంగా.. ఆ దేశ ప్రజలందరూ అల్లాడిపోతున్నారు. చాలా కంపెనీలు బ్యాన్ విధించడంతో కొందరు ఉద్యోగాలు లేక రోడ్డున పడుతున్నారు. మరి కొందరు.. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో నాలుగు గోడల మధ్యే ఉంటున్నారు. వ్యాపారాలు ఊహించని స్థాయిలో దెబ్బతిన్నాయి. ప్రపంచంలో నార్త్ కొరియా, ఇరాన్ లాంటి దేశాల కంటే రష్యాపైనే ఎక్కువ ఆంక్షలు అమలవుతున్నాయి.
మరోవైపు మల్టీ నేషనల్ కంపెనీలన్నీ యుద్ధానికి నిరసనగా రష్యాలో తమ ఆపరేషన్స్ ఆపేశాయి. కొన్ని కంపెనీలైతే రష్యా మార్కెట్ నుంచి పూర్తిగా వెళ్లి పోతున్నట్టు ప్రకటించాయి. అంతర్జాతీయ సంస్థలు, బ్రాండ్లు ఇప్పుడు రష్యాలో కనిపించడంలేదు. ఇప్పటికైనా యుద్ధం విరమించకుండా కొనసాగిస్తే రష్యా పరిస్థితి ఇంకా దారుణంగా మారనుంది. ఆంక్షలతో రష్యా అల్లాడుతున్నా యుద్ధానికి వెనకడుగు మాత్రం వేయకపోవడంతో.. ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.