రాజుల కాలంలో ధరించిన నగలు, వస్తువులు ఆక్షన్ లో భారీగా అమ్ముడపోతుంటాయి. కానీ ఓ పాత కాలం నాటి వస్తువు ఏకంగా రికార్డు స్థాయి ధర పలికింది. ఇంతకూ ఆ వస్తువు ఏంటంటే..?
ప్రస్తుతం అంటీక్ పీస్‌లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎంత పాత కాలం నాటిదైతే అంత విలువ. ఎక్కడా, ఎప్పుడూ లభించని అరుదైన, పాత వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. వీటికి సంబంధించిన ఆక్షన్ నిర్వహించినా లక్షలు పోసి కొంటారు అంటీక్ పీస్ ప్రియులు. రాజుల కాలం నాటి వస్తువుల నుండి స్వాతంత్ర సంగ్రామంలోని ప్రముఖులు వాటిన వస్తువుల వరకు కోట్లు పెట్టి కొనుగోలు చేసేందుకు ఊవిళ్లురూతుంటారు. అలాంటి వస్తువే ఇప్పుడు ఆక్షన్ కు రాగా, కాసుల వర్షం కురిపించింది. ఇంతకీ ఆ వస్తువు ఏంటో తెలుసా..?
అదే పాత మోటారు బైక్. పాత హార్లీ డేవిడ్ సన్ బైక్‌ను ఇటీవల లాస్ వేగాస్‌లోని మెకమ్ ఆక్షన్లో వేలం వేయగా రికార్డు స్థాయిలో ధర పలికింది. ఇది 935000 డాలర్లకు అమ్ముడైంది. అంటే భారత కరెన్సీలో రూ. 7.72 కోట్లు. సైకిల్ లా కనిపించే ఆ వస్తువుకు చాలా ప్రత్యేకత కూడా ఉంది. ఇది 115 ఏళ్ల క్రితం తయారు చేశారు. 1908 నాటి ఈ మోడల్ బైక్ కు స్ట్రాప్ ట్యాంకర్ అని పేరు. ఆయిల్, ఇంధన ట్యాంకును నికెల్ తో చేసిన పట్టీలతో జతచేసి ఉంటడంతో దానికా పేరు వచ్చింది. దీనికి రికార్డు స్థాయి ధర పలకడంపై ఈ విభాగం ఆక్షన్ మేనేజర్ ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి మోటారు బైక్‌లో అప్పటి కాలం నాటి భాగాలు చాలా ఉన్నాయని తెలిపారు.
ట్యాంక్, చక్రాలు, సీట్ కవర్ ఇవన్నీ కూడా 115 ఏళ్ల క్రితం తయారు చేసినప్పటివేనన్నారు. 1908లో ఉత్పత్తి చేసిన 450 మోటారు సైకిళ్లలో.. ప్రపంచం మొత్తంగా 12 కన్నా తక్కువే ఉన్నట్లు సమాచారం. అందులోనూ అప్పుడు రూపొందించిన పరికరాలతో ఉన్నవీ కూడా చాలా తక్కువగా ఉన్నాయట. అయితే ఎవరూ కొన్నారన్న వివరాలు తెలియరావడం లేదు. సంస్థ కూడా వెల్లడించలేదు. పాత కాలం నాటి వస్తువులకు మంచి గిరాకీ పలుకుతుందని తెలుసుకానీ, ఈ బైక్ ఏకంగా కోట్లు కుమ్మరించిన ఎవరా అని ఆరా తీస్తున్నారు పలువురు. ఇంత ఖరీదు పెట్టి బైక్ ను కొనుగోలు చేయడం అవసరమంటారా.. ? దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.