భారత ప్రధాన మంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ ప్రపంచ దేశ నేతల్లో మొదటి స్థానంలో నిలిచారు. ప్రధాని బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నరేంద్ర మోదీ ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. దేశంలో పేదరిక నిర్మూలన, మహిళా సంక్షేమ పథకాలు, కరోనా సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇలా ఎన్నో ప్రజల్లో అత్యంత ఆదరణ లభించేలా చేసిందని.. ఈ కారణం చేతనే ఆయన పాలనను 75 శాతం మంది ఆదరిస్తూ.. అభిమానిస్తున్నారని అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ ఒక సర్వేలో తెలియజేసింది.
ప్రపంచ దేశాల్లో అత్యంత ప్రజాధరణ పొందిన అగ్ర నేతల లిస్ట్ లో మొదటి స్థానంలో నరేంద్ర మోదీ నిలిచారు. ఇక ద్వితీయ స్థానంలో మెక్సికో అధ్యక్షులు ఆండ్రెస్ మాన్యుయేల్ లోపేజ్ ఓబ్రడార్ ఉన్నారు. ఆయనకు 63 శాతం ఓటింగ్ పడింది. ఆ తర్వాత మూడో స్థానంలో ఇటలీ ప్రధాని మారియో ద్రాగీ 53 శాతం ఓటింగ్ తో ప్రజాధరణ పొందారు. కెనడా అధ్యక్షులు జస్టిస్ ట్రూడో(39), జపాన్ ప్రధాని పుమియో కిషిద(38), ఫ్రాన్స్ కి చెందిన మేక్రాన్(34), జర్మనీ నేత చాన్సలర్ షోల్జ్(30) తో తర్వాత స్థానంలో నిలిచారు.
ఈ జాబితాలో 22 మంది ప్రపంచ అగ్ర నేతలను పొందుపరిచారు. అయితే ఈ డేటాను అమెరికా ఇంటెలీజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ ప్రపంచ దేశాల్లో అగ్ర నేతల కు ఉన్న ప్రజాధరణను ట్రాక్ చేస్తుంది. అలాగే పలు ఇంటెలీజెన్స్ విభాగల ద్వారా రాజకీయ విధానాలపై వారి తీరు తెన్నులపై పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి తీర్మాణాం ఇస్తుంది. ఇలా చేసిన సర్వేలో ఈసారి కూడా ప్రధాని మోదీ మొదటి స్థానం సంపాదించడం ఎంతో గర్వకారణంగా ఉందంటున్నారు అభిమానులు.