అనురాగ్ చంద్ర తన ఇంటి కాలింగ్ బెల్ కొట్టిన ముగ్గురు యువకులను తన కారులో వెంబడించాడు. ఆ కారు వేగంగా వారి కారు వెంటపడింది. ఈ నేపథ్యంలోనే ఊహించని సంఘటన చోటుచేసుకుంది.
ఈ మధ్య కాలంలో ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి రాద్దాంతం చేయడం జనాలకు అలవాటైంది. చిన్న చిన్న విషయాలకే కొందరు గొడవలు పెట్టుకుంటున్నారు. చిన్న గొడవలే తర్వాత హత్యలు, ఆత్మహత్యల వరకు వెళుతున్నాయి. తాజాగా, ఓ వ్యక్తి తన ఇంటి కాలింగ్ బెల్ కొట్టారని ముగ్గురు యువకుల ప్రాణాలు పోవటానికి కారణం అయ్యాడు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అమెరికా కాలిఫోర్నియాలోని రివర్ సైడ్ కౌంటీ లో భారతీయ సంతతికి చెందిన అనురాగ్ చంద్ర నివాసం ఉంటున్నాడు. 2020 జనవరి నెలలో రోజు రాత్రి ముగ్గురు యువకులు అతడి ఇంటి కాలింగ్ బెల్ కొట్టారు.
దీంతో అనురాగ్‌కు కోపం వచ్చింది. వారి వెంట పడ్డాడు. కారులో వారిని వెంబడించాడు. ఈ నేపథ్యంలోనే వారి కారు ప్రమాదానికి గురై ముగ్గరు చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు అనురాగ్ మీద అనుమానంతో విచారించగా.. పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. దీంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత తమదైన స్టైల్లో విచారించారు. ఈ నేపథ్యంలోనే అతడు అసలు విషయం బయటపెట్టాడు. ‘‘ ఓ రోజు కొందరు టీనేజర్లు నా ఇంటి డోర్ బెల్ ను మోగించి తనను ఆటపట్టించారు. ఆ సమయంలో నేను 13 బీర్లు తాగి ఉన్నాను. మత్తులో ఏమి చేసాననే విషయం నాకు గుర్తులేదు.
వాళ్లు నా వెనుక భాగంపై కొట్టి కారులో పారిపోవడానకి ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు నేను ప్రయత్నించాను. ఈ నేపథ్యంలోనే నా కారు వారి వాహనాన్ని ఢీ కొంది. తర్వాత వారి వాహనం అతివేగంతో చెట్టుకు ఢీ కొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు’’ అని పోలీసులకు వెల్లడించాడు. పోలీసులు అనురాగ్ నుంచి కీలకమైన ఆధారాలను సేకరించి కోర్టులో సమర్పించారు. దీనిపై విచారణ జరిపిన న్యూయార్క్ కోర్టు అనురాగ్ చంద్రను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో అనురాగ్ చంద్రకు యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.