సాధారణంగా ఆడవారిపై మగవారికి, మగవారిపై అడవారికి ఆకర్షణ కలగడం సహజం. అయితే.. శరీరంలో కొన్ని హార్మోనుల ప్రభావం వల్ల.. ఆడవారిపై అడవారికి, మగవారిపై మగవారికి ఆకర్షణ కలుగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇద్దరు ఆడవాళ్లు, ఇద్దరు మగవాళ్ళు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం లాంటి ఘటనలు గత కొన్నేళ్లుగా తరుచుగా జరుగుతున్నాయి కూడా. వీరినే స్వలింగ సంపర్కులు అంటారు. చాలాదేశాల్లో వీటికి అనుమతులు కూడా ఉన్నాయనుకోండి. అయితే.. మనం చెప్పబోయే కథ దీనికి పూర్తిగా విభిన్నం. ఒక మహిళ.. పురుషుడిగా మారి.. శరీరంలో వచ్చిన మార్పులు నచ్చక మరలా మహిళగా మారింది. ఈ మొత్తం ప్రయాణాన్ని తాను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.
మిచిగాన్‌లోని డెట్రాయిట్ కు చెందిన అలియా ఇస్మాయిల్ అనే యువతి సాధారణంగా అమ్మాయే అయినా.. చిన్నప్పటి నుంచి అబ్బాయిగానే పెరిగింది. అయితే.., అలియా అమ్మాయే అయినప్పటికీ.. అబ్బాయిలతో డేటింగ్ చేయడం, మేకప్ ధరించడం వంటి వాటికి ఆమడ దూరం. ఈ క్రమంలో తనకు 19 ఏళ్ల వయస్సున్నపుడు పురుషునిగా మారాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ‘టెస్టోస్టెరాన్ థెరపీ’తో పురుషుడిగా మారే ప్రక్రియను ప్రారంభించింది. 5 ఏళ్లకు తాను అనుకున్నట్లుగానే మార్పులొచ్చాయి. మంచి సిక్స్ ప్యాక్ బాడీతో అబ్బాయిలానే మార్పొచ్చింది. అయితే.. ఈ మార్పులు తనకు నచ్చలేదు. డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. మరలా.. ‘డి-ట్రాన్సిషన్’ చేపించుకోవాలని.. తిరిగి అమ్మాయిగానే జీవించాలని నిర్ణయం తీసుకుంది. టీ థెరపీ విధానాన్ని మానేసి మహిళగా తిరిగి తన గమన్యానికి చేరుకుంది. ఇలా.. తన ప్రయాణాన్ని అలియా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం విశేషం.
ఇది కూడా చదవండి: Peru: ప్రపంచంలోనే అతి చిన్న వయసులో తల్లైన చిన్నారి.. ఐదేళ్ల వయసులోనే బిడ్డకు జన్మ!
ఈ విషయం గురుంచి అలియా మాట్లాడుతూ.. “ఇదొక గొప్ప అనుభూతి. అబ్బాయిగా మారాక.. మళ్లీ మహిళగా కనిపిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. అయితే .. ఇప్పుడు కనిపించే స్త్రీలింగ వ్యక్తిగా నేను జీవితాంతం ఉంటానా అన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పలేను. ఏదేమైనప్పటికీ తన ప్రయాణం మాత్రం మంచి గుణపాఠాన్ని నేర్పింది” అని తెలిపింది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.