ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో ఓ యువతి తన లాలాజలాన్ని అమ్మి లక్షలు సంపాదిస్తోంది. అది కూడా నెలకు 41 లక్షల రూపాయలు సంపాదిస్తోంది.
డబ్బులు సంపాదించటానికి కాదేదీ అనర్హం అన్నట్లుగా ప్రస్తుత సమాజ పరిస్థితి తయారైంది. నేడు చెత్తను కూడా డబ్బులకు అమ్మే పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో ఓ యువతి తన లాలాజలాన్ని అమ్మి లక్షలు సంపాదిస్తోంది. అది కూడా నెలకు 41 లక్షల రూపాయలు సంపాదిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌కు చెందిన లేటిష జోన్స్.. బయోకెమికల్ సైన్స్ చదువుతూ ఉండేది. ఆమె మాంచెస్టర్‌లోని టెస్కోలో పార్ట్‌టైం చేస్తూ ఉండేది. అయితే, కొన్నేళ్ల క్రితం ఆమె ఓన్టీఫ్యాన్స్ అనే అడల్ట్ సైట్‌లో చేరింది. తనకు సంబంధించిన ఫొటోలు అప్‌లోడ్ చేస్తూ ఉండేది.
ఈ నేపథ్యంలోనే ఓ రోజు ఆమెను ఓ అభిమాని ఓ వింత కోరిక కోరాడు. తనకు ఓ బాటిల్ లాలాజలం కావాలని అడిగాడు. దానికి కొంత డబ్బు ఇస్తానని కూడా చెప్పాడు. మొదట ఆమె నమ్మలేదు. తర్వాత కొంతమంది ఆమె నిద్రపోయిన బెడ్‌షీట్లు, జిమ్ బట్టలు, టూత్ బ్రస్‌లు, టూతు పేస్ట్ ఉమ్మి, పోసుకున్న నీళ్లు ఇలా అన్నింటిని అడిగేవారు. అప్పుడు ఆమెకు నమ్మకం వచ్చింది. తర్వాత తన లాలాజలం అడిగిన వారికి అమ్మటం మొదలుపెట్టింది.
ఒక్కో బాటిల్ లాలాజలాన్ని.. 30 వేల రూపాయల నుంచి 1.5 లక్షల రూపాయల వరకు తీసుకుంటోంది. అలా నెలకు 41 లక్షలు రూపాయలు సంపాదిస్తోంది. ఆ వచ్చిన డబ్బులతో తన అప్పులన్నీ తీర్చేసింది. ఆఖరికి తన ఉద్యోగం మానేసి మరీ లాలాజలం అమ్మటాన్నే ఉపాధిగా పెట్టుకుంది. ఇది తనకు ఎంతో సంతోషంగా ఉందని అంటోంది. మరి, లాలాజలాన్ని అమ్మి నెలకు 41 లక్షల రూపాయలు సంపాదిస్తున్న మాంచెస్టర్ యువతి ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.