ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఓలా, ఊబర్ వంటి క్యాబ్ సర్వీసులనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. షార్ట్ డ్రైవ్ లైనా, లాంగ్ డ్రైవ్ లైనా క్యాబ్ కంపల్సరీ. ఈ ట్రాఫిక్ బాధలు ఎవడు పడతాడని క్యాబ్ లకి పోతున్నారు. పెద్ద జీతగాళ్ళకి కొంచెం రీజనబుల్ గా ఉంది కాబట్టి క్యాబ్ ల మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. దీంతో క్యాబ్ లకి డిమాండ్ బాగా పెరిగింది. ఈ డిమాండ్ కారణంగా వర్షాకాలం లాంటి సీజన్స్ ని బాగా క్యాష్ చేసుకుంటున్నారు సదరు క్యాబ్ సర్వీస్ సంస్థలు. ఇది ఎలాగూ ఉండేదే గానీ.. మరీ 10 కిలోమీటర్ల లోపు ప్రయాణానికి కూడా 32 లక్షలు వసూలు చేయడం ఏంటి టూ మచ్ కాకపోతే. గట్టిగా పావు గంట జర్నీ, పోనీ తుఫాన్, బీభత్సమైన వర్షాలు, వరదలు ఏమైనా వచ్చాయా? అంటే అదీ లేదు. మరి 15 నిమిషాల ప్రయాణానికి, జస్ట్ ఆరేడు కిలోమీటర్ల దూరానికి ఊబర్ ఎందుకు అన్ని లక్షలు ఛార్జ్ చేసింది?
Uber Charges Rs 32 Lakh To British Man For A 15-Minute Ride: Report https://t.co/KvWFKvfvBC pic.twitter.com/kHTWM84WsR
— NDTV (@ndtv) October 8, 2022
వివరాల్లోకి వెళ్తే.. ఒలివర్ కప్లన్ అనే వ్యక్తి ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ లో ఉన్న బక్స్టన్ అనే హోటల్ లో పని చేస్తున్నాడు. పని ముగించుకున్న తర్వాత విచ్ వుడ్ లో ఉన్న పబ్ లో ఫ్రెండ్స్ ని కలిసేందుకు ఊబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. 6.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతే. క్యాబ్ కి 11 డాలర్ల నుంచి 12 డాలర్లు అవుతుంది అంతే కదా అని ఒలివర్ అన్నయ్ క్యాబ్ బుక్ చేసుకుని ఎక్కేసాడు. అయితే ఒలివర్.. ఆటో పే ఆప్షన్ ని సెట్ చేశాడు. క్రెడిట్ కార్డు నుంచి అమౌంట్ కట్ అయ్యేలా సెట్ చేశాడు. డ్రాప్ లొకేషన్ వచ్చిన తర్వాత దిగేసాడు. మనోడు హ్యాపీగా ఫ్రెండ్స్ తో పబ్ లో ఎంజాయ్ చేశాడు. బాగా తాగి ఇంటికొచ్చాడు. బాగా నిద్రపోయాడు. పొద్దున్న ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చింది. మీ ట్రిప్ కి అయిన ఖర్చు 39,317 డాలర్లు అని మెసేజ్ సారాంశం.
దెబ్బకి ఒలివర్ కి రాత్రి తాగింది దిగిపోయిందంట. ఒడి నిమ్మ జీవితం.. ఇదెక్కడి మాసురా బాబు.. పావు గంట జర్నీకి ఇంత బిల్లు ఏంటి అని అనుకున్నాడట. క్రెడిట్ కార్డులో అంత అమౌంట్ లేదు కాబట్టి సరిపోయింది గానీ లేదంటే ఆ అమౌంట్ రాబట్టుకోవాలంటే నానా చావు చావాల్సి వచ్చేదని అన్నాడు. అయితే ఈ విషయం సంస్థకి తెలియజేయడంతో.. జరిగిన పొరపాటుని సరిదిద్దుకున్నారు. డ్రాప్ లొకేషన్ పొరపాటున ఆస్ట్రేలియా చూపించిందని.. యాప్ లో లోపం వల్ల ఇలా జరిగిందని యాప్ ఇంజనీర్లు తెలిపారు. విచ్ వుడ్ నుంచి ఆస్ట్రేలియాలో ఉన్న విక్టోరియా పార్క్ కి క్యాబ్ బుక్ అయినట్టు ఇంజనీర్లు తెలిపినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
Uber charges a British man Rs 32 lakhs for 15-minute ride: report
A British man was left stunned when he checked his bank account and found that Uber had intended to charge him almost $39,317 nearly..#uber #british #manchester #kaplan #newsservice #ubercharges #TFM pic.twitter.com/rGqQNkQ8eD— THE FREE MEDIA (@THEFREEMEDIA2K) October 8, 2022
అతనెక్కింది ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ సిటీలో. కానీ డ్రాప్ లొకేషన్ ఆస్ట్రేలియా అన్నట్టు చూపించింది. అసలు ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియాకి కారులో ప్రయాణం చేసే అవకాశమే లేదు. ఒకవేళ క్యాబ్ వాళ్ళు సీరియస్ గా తీసుకుని తీసుకెళ్లాలంటే మొత్తం దూరం 15 వేల కిలోమీటర్లు. గంటకి 100 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తే 100 గంటలు పడుతుందని ఒక అంచనా. అంటే కనీసం 4 రోజులు పడుతుంది. ఆ లెక్కన చూసినా రూ. 32 లక్షలు అవ్వవు. అసలు ఫ్లైట్ కి కూడా ఆ రేటు లేదు కదా. గట్టిగా లక్షా 50 వేల నుంచి 2 లక్షలు అంతే. అయినా ఇంగ్లాండ్ లో ఎక్కడో మాంచెస్టర్ సిటీలో ఒక రెస్టారెంట్ లో పని చేసుకునే వ్యక్తి సరదాగా ఫ్రెండ్స్ తో బార్ లో ఎంజాయ్ చేద్దామని క్యాబ్ బుక్ చేసుకున్నందుకు అతని జీవితాన్ని ఇలా బుక్ చేస్తారా? ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు భలే కామెడీ అనిపిస్తుంది.