తల్లిదండ్రులు.. పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలని అనుకుంటారు. దాని కోసం ఎంతో కష్ట పడతారు.. చదువుకుంటేనే వారి జీవితం బాగుపడుతుందని.. మంచి మంచి స్కూల్లలో చదువు చెప్పించాలని భావిస్తారు. అందుకోసం అప్పు తెచ్చైనా.. తలతాకాట్టు పెట్టైనా పిల్లలను చదివించాలని చూస్తారు. ఈ క్రమంలోనే బడిలో చేర్పించడానికి.. గొప్ప స్కూల్లను పరిశీలిస్తూంటారు. ఈ క్రమంలోనే సాధారణ ప్రజలు సైతం తమ పిల్లలను చదివించలేని కొన్ని పాఠశాలలు ఉన్నాయి. మరి ఎన్నో ప్రత్యేకతలతో కూడుకున్న ఆ బడులు ఎక్కడున్నాయో తెలుసుకుందామా? మరిన్ని వివరాల్లోకి వెళితే..
ప్రస్తుత ఆధునిక సమాజంలో చదువుకుంటేనే పిల్లలకు భవిష్యత్తు. అందుకే తల్లిదండ్రులు కూడా వారి విద్యాభ్యాసం గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. అయితే సామాన్య మానవుడు చదివించలేని కొన్నిస్కూల్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్విట్జర్లాండ్ లో విద్యావ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. ఇక ఈ దేశంలోని ఇన్ స్టిట్యూట్ లే అనే విద్యాలయంలో చదువు చాలా ఖరీదైంది. ఈ స్కూల్లో సంవత్సరానికి ఫీజు ఎంతో తెలిస్తే మీరు నోరెళ్లబెట్టడం ఖాయం. ఈ బడిలో ఏడాదికి 1,25, 000 స్విస్ ఫ్రాంక్ లు అంటే మన కరెన్సీలో అక్షరాల కోటి రూపాయల పైనే అన్నమాట. ఈ పాఠశాలలో 420 మంది పిల్లలు రెండు లాగ్వేజిల్లో విద్యభ్యాసం చేయవచ్చు.
ఇక ఇదే దేశంలో ఉన్న మరో స్కూల్ వరల్డ్ లోనే అత్యంత ఖరీదైన పాఠశాలగా పేరొందింది. ఆ బడి పేరే.. ఆల్పిన్ బ్యూ సోలీల్. ఈ స్కూల్లో కూడా 2 లాగ్వేజిల్లో చదువుకోవచ్చు. ఇక ఈ బడిలో ఫీజు 1,50,000 స్విస్ ఫ్రాంక్ లు అంటే ఇండియా కరెన్సీలో సుమారు రూ.1.23 కోట్లు. 50 కి పైగా దేశాల పిల్లలు ఈ బడిలో చదువుతున్నారు. ఈ స్కూల్లో కేవలం 260 మంది విద్యార్థులుండగా.. ఒక్కో విద్యార్థికి నలుగురు టీచర్లు ఉండటం గమనార్హం. స్విట్జర్లాండ్ లోని లెసిన్ నగరంలో ఉన్న మరో బడి లెసిన్ అమెరికన్ స్కూల్.. 340 మంది ఉన్న ఈ బడి ఫీజు సంవత్సరానికి 85 లక్షలు. ఇక UK లో ఉన్న హార్ట్ వుడ్ హౌజ్ స్కూల్లో ఫీజు ఏడాదికి 22 లక్షలు ఉన్నప్పటికీ.. దీనికి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే? ఇంటర్య్వూల్లో అర్హత పొంది, రిఫరెన్స్ ఉన్న వారే ఈ స్కూల్లో ప్రవేశం పొందగలరు. ఇవే కాక ప్రపంచంలో మరెన్నో స్కూల్లలో ఫీజు లు భారీగా ఉన్నాయి.