మెదడులో 10 శాతాన్ని మాత్రమే వాడుకుంటున్నామని. మిగతా 90 శాతాన్ని కూడా సానబెట్టి, వాడుకుంటే మరిన్ని తెలివితేటలతో, మరింత సృజనాత్మకంగా, విజయవంతంగా మారొచ్చుననే భావన ఎంత మాత్రం నిజం కాదు. ‘ఫంక్షనల్ మాగ్నటిక్ రిజొనెన్స్ ఇమేజింగ్’ అనే సాంకేతిక పద్ధతిలో నాడీ సంబంధిత శాస్త్రవేత్తలు దీనికి సమాధానం చెప్పగలరు. ఈ పద్ధతిని ఉపయోగించి ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు మనిషి మెదడులో ఏ భాగాలు స్పందిస్తున్నాయో తెలుసుకోవచ్చు. మెదడులోని ‘అమిగ్దల’ అనే భాగం కోపం, వ్యాకులత వంటి భావోద్వేగాలను నియంత్రిస్తుంది. రకరకాల పరికరాలు మార్కెట్లోకి వస్తున్నాయి. మెదడుని చదివే ‘హెల్మెట్ల’ని అమెరికాకి చెందిన కెర్నెల్ సంస్థ తీసుకువచ్చింది. 50వేల డాలర్లు విలువ చేసే ఈ హెల్మెట్లు మనిషి మెదడుని చదువుతాయట.
మనిషి ఆలోచనలు, ఏ పరిస్థితులకి ఏ విధంగా ప్రవర్తిస్తారు అనే విషయాలతో పాటు రక్త ప్రవాహం, ఆలోచనల వేగం, బయట పరిస్థితులకు శరీర అవయవాలు స్పందించే తీరుని ఈ హెల్మెట్లు పసిగడతాయట. ప్రస్తుతానికి కొంతమందికే ఈ హెల్మెట్లు పంపబడ్డాయి. అక్కడ సక్సెస్ అయితే గనక మార్కెట్లోకి విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ హెల్మెట్లలో మెదడులో కలిగే ఆలోచనలను అంచనా వేయగలిగే పరికరాలు, సెన్సార్లు ఉంటాయి. ఈ హెల్మెట్ బరువు సుమారు 2పౌండ్లు ఉంటుందని సమాచారం.ఈ హెల్మట్లని తయారు చేయడానికి 5సంవత్సరాలు పట్టిందని, సుమారు 110మిలియన్ డాలర్ల ఖర్చు అయ్యిందని సంస్థ అధినేత అయిన కెర్నెల్ బ్రాన్ జాన్సన్ వెలిబుచ్చాడు.
మొత్తానికి మనిషి ఆలోచనలు కూడా చదవగలడం అంటే సాంకేతికతలో పురోగామి సాధించినట్టే. ఐతే ఈ పురోగామి మంచికి మాత్రమే ఉపయోగపడితే మంచిది.